బ‌డ్జెట్ పెంచేసిన శ్రీ‌విష్ణు

చిత్ర‌సీమ‌కు వెన్నెముక్క మీడియం రేంజు హీరోలే. చిన్న నిర్మాత‌ల‌కు, కాన్సెప్ట్ క‌థ‌ల‌కూ వాళ్లే చిరునామా. మీడియం రేంజు హీరోకి హిట్టు ప‌డితే – మ‌రిన్ని కొత్త క‌థ‌లు పుట్టుకొస్తాయి. కొత్త నిర్మాత‌లు త‌యార‌వుతారు. శ్రీ‌విష్ణు కూడా మీడియం రేంజు హీరోనే. 3 నుంచి 4 కోట్ల‌తో సినిమాని పూర్తి చేసుకుంటే, మినిమం గ్యారెంటీ ఉంటుంది. శాటిలైట్‌, డిజిట‌ల్ రూపంలో పెట్టుబ‌డిని తిరిగిరాబ‌ట్టుకోవొచ్చు. ‘బ్రోచేవారెవ‌రురా’ టైపు హిట్టు ద‌క్కితే – ఇక అంతా లాభ‌మే. అందుకే చిన్న‌సైజు నిర్మాత‌ల‌కు శ్రీ‌విష్ణు ఓ మంచి ఆప్ష‌న్‌గా మిగిలాడు.

అయితే ఇప్పుడు శ్రీ‌విష్ణు కూడా బ‌డ్జెట్లు పెంచుతున్నాడ‌ని టాక్‌. ఈ మ‌ధ్య ప్ర‌దీప్ వ‌ర్మ అనే కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ని ఓకే చేశాడు శ్రీ‌విష్ణు. ఇదో పోలీస్ స్టోరీ. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు బాగానే ఉంటాయి. ఈ సినిమా చేయ‌డానికి ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు ముందుకొచ్చారు. అయితే శ్రీ‌విష్ణు రూ.7 నుంచి 8 కోట్ల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటేనే ఈ సినిమా చేయ‌మంటున్నాడ‌ట‌. రూ.4 – 5 కోట్ల‌లో ముగించాల‌ని భావిస్తే మాత్రం కుద‌ర‌దు అంటున్నాడు. రూ.8 కోట్లు ఓ ప్యాకేజీలా ఇస్తే, అందులోనే సినిమా పూర్తి చేసి, ప్ర‌మోష‌న్లు కూడా చేసి పెడ‌తానంటున్నాడ‌ట‌. శ్రీ‌విష్ణుపై 8 కోట్లు రిస్కే. అందుకే ఈ సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు వెనుకా ముందూ ఆలోచిస్తున్నార్ట‌. ‘బ్రోచేవారెవ‌రురా’ హిట్టు త‌ర‌వాత 8 కోట్లు పెట్ట‌డానికి నిర్మాత‌లు రెడీ అయ్యారేమో. మ‌ధ్య‌లో ‘తిప్ప‌రా మీసం’ వ‌చ్చింది. అది డిజాస్ట‌రు. ఆ సినిమా చూశాక ఇంత ధైర్యం ఎవ‌రు చేస్తార‌ని..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close