యూత్, ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసే హీరో శ్రీవిష్ణు. గతంలో కొన్ని యూనిక్ సినిమాలు ప్రయత్నించారు కానీ తనకి ఈ జోనరే కలిసొచ్చింది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఒక థ్రిల్లర్ చేస్తున్నారు. అదే ‘మృత్యుంజయ్’. హుసేన్ షా కిరణ్ దర్శకత్వం. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని బయటికి వదిలారు. ట్రైలర్ లో దాదాపు ఈ కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు.
పక్కా క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక క్రైమ్ జరుగుతుంది. దాని కారణంగా కొన్ని జీవితాలు నష్టపోతాయి. ఆ క్రైమ్ చిక్కుముడిని విప్పే బాధ్యత హీరోపై వుంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం చాలా వెరైటీ రాసుకున్నారు. ముఖ్యంగా శ్రీవిష్ణు ఇందులో చాలా గెటప్స్ లో కనిపించారు. ఆయన పాత్రలో చాలా వేరియెషన్స్ వున్నాయి. దర్శకుడు హుసేన్ షా కిరణ్ ట్రైలర్ కట్ బావుంది. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఆపడం ట్రైలర్ లో కూడా ఒక కథ చెప్పిన అనుభూతిని ఇచ్చింది. ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి థ్రిల్లర్ పడలేదు. ఆ లోటు మృత్యుంజయ్ తీరుస్తుందేమో చూడాలి.
