ఏఐ టెక్నాలజీని సోషల్ మీడియాలో కొందరు అశ్లీలతకు, అవమానానికి, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడానికి వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలని టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ ఫోటోలు, వీడియో కంటెంట్ లతో ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా శ్రీలీల ఏఐ ఫేక్ కంటెంట్ బారిన పడింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని సోషల్‌మీడియా వినియోగిస్తున్న వారందరినీ అభ్యర్థించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
సోషల్‌మీడియా యూజర్స్ కి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఏఐతో సృష్టించే చెత్తకు సపోర్ట్ చేయొద్దు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించండి. ప్రతి వారికి రక్షణతో కూడిన వాతావరణం ఉందన్న నమ్మకాన్ని ఇవ్వాలి. నాకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆన్లైన్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నా. అలాంటి కొన్నింటిని నా శ్రేయోభిలాషులు నా దృష్టికి తీసుకొచ్చారు. చాలా విషయాలను పెద్దగా పట్టించుకోను. నా దృష్టికి వచ్చిన ఈ విషయం మాత్రం నన్ను బాధించింది. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం చూస్తున్నా. మాకు అండగా నిలబడమని అభ్యర్థిస్తున్నా. ఇక్కడి నుంచి అధికారులు తగిన యాక్షన్ తీసుకుంటారు’అని పోస్ట్ చేసింది.
నిజానికి ఇది ఒక్క శ్రీలీల సమస్యగా కాదు… వ్యక్తిగత హక్కులు, గౌరవం, డిజిటల్ భద్రతకు సంబంధించిన సమాజపు బాధ్యతగా మారాల్సిన అంశం. టెక్నాలజీ మనల్ని ముందుకు నడిపించాలి గానీ మనుషుల్ని కించపరచడానికి కాదు. ఏఐ, సోషల్ మీడియాతో అద్భుతాలు చేయొచ్చు. కానీ కొందరు మాత్రం ఇలాంటి చెత్తపనులకు వాడుకొని ఎదుటివారిని హర్ట్ చేయడం బాధాకరం.
