తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలో చేరి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం అత్యంత అసహ్య కరంగా కామెంట్లు చేసిన వల్లభనేని వంశీకి ఇప్పుడు వైసీపీలో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వంశీని బండ బూతులు తిడుతున్నారు. తాజాగా పుట్ట పర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వల్లభనేనిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు ఆయనతో వైసీపీకి ఏం సంబంధం లేదని ప్రశ్నించారు. ఆయన టీడీపీ బీఫాంపై గెలిచాడన్నారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే రఘునాథరెడ్డి గౌరవసభల పేరుతో గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రీధర్ రెడ్డి మాత్రమే కాదు.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే మాట చెబుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సహా అనేక మంది అసలు వంశీకి వైసీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసేలా ఉండటంతో ఇప్పుడు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయనకు పార్టీతో సంబంధం లేదని పదే పదే .. ఎమ్మెల్యేలతో చెప్పిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వంశీ.. వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి వచ్చి నసూచనల మేరకే.. సాక్షి ప్రతినిధిని మాత్రమే పిలిపించుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వతహాగా అన్నవి కావు. టీడీపీలో ఎప్పుడు ఎవర్ని ఎలా తిట్టారో వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి నాయకులకు సూచనలు వస్తాయి. ఇప్పుడు వంశీని దూరం పెట్టాలని.. ఆయనకు వైసీపీతో సంబంధం లేదని చెప్పాలన్న సూచనలు కూడా అలాగే వస్తున్నాయంటున్నారు. అదే జరిగితే.. వంశీ రెంటికి చెడ్డ రేవడి అవడమే కాదు.. రాజకీయంగా.. వ్యక్తిగతంగా కూడా తీవ్రమైన దెబ్బతినడం ఖాయమని అనుకోవచ్చని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.