నెల్లూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, తరలింపు, పేలుడు పదార్థాల కేసుల కీలక మలుపు చోటు చేసుకుంది. ఇందులో అనిల్ కుమార్ కూడా డబ్బులు దండుకున్న విషయం బయట పడింది. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అనిల్ కుమార్ వ్యాపార భాగస్వామి. అతను క్వార్జ్ మైనింగ్ స్కాంలో అనిల్ పాత్రపై శ్రీకాంత్ రెడ్డి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది.
“2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో కలిసి క్వార్జ్ వ్యాపారం చేస్తున్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి బయట పెట్టారు. లీజు గడువు అయిపోయిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీసేవాళ్ళం. వాకాటి శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి మైనింగ్ పనులు చూసేవాళ్లని పోలీసులు చెప్పారు. తాను పనులను పర్యవేక్షించేవాడిని.. అందుకు టన్నుకు రూ.1000 ఇచ్చేవాళ్లుని తెలిారు. తవ్విన క్వార్జ్‌ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లమని. ఆయనకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నమన్నారు. అక్కడి నుంచి క్వార్జ్‌ను చైనాకి ఎగుమతి చేశామని వచ్చిన డబ్బులను కాకాణితో పాటు అనిల్ కుమార్ కూడా తీసుకున్నారని చెప్పాడు.
శ్రీకాంత్ రెడ్డి అసలు విషయం చెప్పడంతో ఇప్పుడు అనిల్ కుమార్ చుట్టూ అసలు కథ ప్రారంభం కానుంది. బెట్టింగ్ రాకెట్ ను నిర్వహించడంలో అనిల్ కీలక వ్యక్తి అని పోలీసులు నమ్ముతారు. అయితే ఇలాంటి అక్రమాల్లో మొదటి సారి ఆయన పేరు బయటకు వచ్చింది. నగదు లావాదేవీల్లో అనిల్ కు లేదా ఆయన కుటుంబసభ్యులకు డబ్బులు చేరినట్లుగా తెలిస్తే.. ముందస్తు బెయిల్స్ కోసం ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి అనిల్ కూ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.