శేఖ‌ర్ సూరితో శ్రీ‌కాంత్‌

ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల‌దే హ‌వా. ఒక‌ప్పుడు హిట్ సినిమాలు తీసి, ఆ త‌ర‌వాత ఫ్లాపుల‌తో సైడ్ అయిపోయిన డైరెక్ట‌ర్ల‌కు కూడా కావల్సినంత ప‌ని దొరుకుతోంది. తెర మరుగైపోయిన ద‌ర్శ‌కులు మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టి సంద‌డి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో శేఖ‌ర్ సూరి కూడా చేరిపోయాడు. ఏ ఫిల్మ్ బై అర‌వింద్ సినిమాతో ఆక‌ట్టుకున్నాడు శేఖ‌ర్ సూరి. ఆ త‌ర‌వాత ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి. కొన్నేళ్లుగా శేఖ‌ర్ సూరి పేరు వినిపించ‌డం లేదు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో మ‌ళ్లీ ఆయ‌న తెరంగేట్రం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో శ్రీ‌కాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. అమేజాన్ అప్రూవ‌ల్ ఇచ్చిన స్క్రిప్టు ఇది. మొత్తం ప‌ది ఎపిసోడ్లు ఉంటాయ‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ పూర్తి చేసి, ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రం చేయాల‌ని అమేజాన్ భావిస్తోంది. పెప్టెంబ‌రు, లేదా అక్టోబ‌రులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా - బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు...

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

HOT NEWS

[X] Close
[X] Close