మ‌హేష్‌కి మ‌రో క‌థ చెబుతా: శ్రీ‌నువైట్ల‌

మ‌హేష్‌బాబు కెరీర్‌లో మ‌ర్చిపోలేని చిత్రం `దూకుడు`. మ‌హేష్ కామెడీ టైమింగ్ కి అది ప‌రాకాష్ట‌. ఒకే సినిమాలో మూడు ర‌కాల పాత్ర‌లూ వేయ‌డం అదే తొలిసారి. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించుకుంది. ఆ సినిమా విడుద‌లై… ఈ రోజుతో ప‌దేళ్లు. దూకుడు లాంటి మ్యాజిక్ మ‌ళ్లీ సృష్టించాల‌న్న‌ది శ్రీ‌నువైట్ల తాప‌త్ర‌యం. `ఆగ‌డు` చేసినా – అనుకున్న ఫ‌లితం రాలేదు. ఆ ఫ్లాప్‌తో శ్రీ‌నువైట్ల కెరీర్ మ‌స‌క‌బారింది. అయితే మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ చేయ‌డానికి శ్రీ‌ను త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. మ‌హేష్ కోసం శ్రీ‌నువైట్ల మ‌రో క‌థ సిద్ధం చేసుకున్నార్ట‌. త్వ‌ర‌లోనే మ‌హేష్ కి చెప్పి ఒప్పిస్తా అంటున్నాడు శ్రీ‌నువైట్ల‌.

”దూకుడుకి సీక్వెల్ అని చెప్ప‌లేను గానీ.. ఆ రేంజ్ లో ఓ క‌థ రాశా. ఇది కూడా మ‌హేష్ కోస‌మే.అయితే ఇంకాస్త క‌స‌ర‌త్తు చేయాలి. అన్ని విధాలా సంతృప్తి ఇచ్చిన త‌ర‌వాతే…. మ‌హేష్ ని క‌లిసి క‌థ చెబుతా.. త‌ను కూడా ఈ క‌థ విని ఎగ్జైట్ అవుతాడ‌న్న న‌మ్మ‌కం ఉంద‌”న్నాడు శ్రీ‌నువైట్ల‌. త‌న ప‌రాజ‌యాల‌పై స్పందిస్తూ…”నాపై కామెడీ ముద్ర బాగా ప‌డిపోయింది. ప్ర‌తీసారీ అదే ఆశిస్తున్నారు. దారి మ‌ళ్లీ ఏదో కొత్త క‌థ చెప్పాల‌నుకున్న‌ప్పుడు నా ప్ర‌య‌త్నాలు బెడ‌సి కొడుతున్నాయి. మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌ను. వినోదాత్మ‌క‌మైన క‌థ‌లే తీస్తా” అని చెప్పుకొచ్చాడు శ్రీ‌నువైట్ల‌. ప్ర‌స్తుతం `డీ అండ్ డీ` సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప‌నిలో ఉన్నారాయ‌న‌. వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌లెడ‌తార్ట‌. మూడు నెల‌ల్లో సినిమాని ముగించాల‌న్న‌ది ప్లాన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close