మోడ్రన్‌ మాస్టర్స్‌ రివ్యూ: ఓ కర్మయోగి రాజముద్ర

-రాజమౌళికి సినిమా అంటే పిచ్చి- ప్రభాస్
-రాజమౌళి హీరో అంటే ఒక వెపన్- ఎన్టీఆర్
-రాజమౌళి అన్ బిలీవబుల్- రామ్ చరణ్

ఇవన్నీ దర్శకధీరుడు రాజమౌళి గురించి హీరోల మనోగతాలు. రాజమౌళిపై తీసిన ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ డాక్యుమెంటరీలో స్టార్స్ పంచుకున్న మనసులోని మాటలు. మోడ్రన్‌ మాస్టర్స్‌ పేరుతో రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీలోని విశేషాలేమిటి? జక్కన్న జీవితంలోని అన్టోల్డ్ స్టోరీ ఏమైనా ఇందులో ఉన్నాయా ? ఓసారి చూద్దాం.

ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో స్క్రీన్ అవుతున్న దృశ్యంతో డాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది. తర్వాత అనుపమ చోప్రా, రాజమౌళితో హాలీవుడ్ లో చేసిన ఇంటర్వ్యూ ద్వారా మిగతా విశేషాలు ముందుకు కదులుతాయి. ఈ ఇంటర్వ్యూ కు ‘హైదరాబాద్ టు హాలీవుడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టడం భలే కుదిరింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, జేమ్స్ కామెరూన్ తో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు, రాఘవేంద్రరావు,శోభు యార్లగడ్డ లాంటి ప్రముఖులు జక్కన్న జర్నీ గురించి చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా సాగుతాయి.

రాజమౌళి బాల్యం గురించి ఆయన మాటల్లోనే వుంటుంది. కామిక్ పుస్తకాలు చదివడం, ఒక కెమరాని ఎప్పుడూ అంటిపెట్టుకోవడం, అర్ధాంగి సినిమా విషయంలో ఫ్యామిలీ ఎదుర్కున్న కష్టాలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లోనే షార్ఫ్ గా చూపించారు.

రాజమౌళి తొలిసారి డైరెక్షన్ ఛాన్స్ వచ్చినప్పుడు పంచుకున్న అనుభవాలు భలే అనిపిస్తాయి. అక్షరాస్యత గురించి ఓ షార్ట్ ఫిల్మ్ కావాలని ప్రభుత్వం నుంచి రాఘవేంద్ర రావుకి ఓ ప్రపోజల్ వచ్చిన సమయంలో ఆ షార్ట్ ఫిల్మ్ కి ఐడియా రాజమౌళినే ఇచ్చారు. దీంతో డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. అయితే తొలి షాట్ తీసుకున్నప్పుడు రాజమౌళి పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. తర్వాత శాంతి నివాసం సీరియల్ అవకాశం. నలఫై ఎపిసోడ్ల కథ చెపితే దాన్ని ఐదు వందల ఎపిసోడ్స్ గా తీసిన రాజమౌళి నన్ను ఆశ్చర్యపరిచాడని రాఘవేంద్ర రావు తన అనుభవాన్ని చెప్పారు.

తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన ఎన్టీఆర్ రివిల్ చేశారు. ఆ సినిమాకి డైరెక్టర్ రాఘవేంద్ర రావే అనుకున్నారట. తీర రాజమౌళి అనే పేరు వినిపించేసరికి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారట తారక్.

అయితే స్టూడెంట్ నెంబర్ 1 రిజల్ట్ తర్వాత తన పరిస్థితి గురించి కొన్ని శక్తికరమైన సంగతులు పంచుకున్నారు జక్కన్న. ఈ సినిమా హిట్ అయ్యింది కానీ రాజమౌళికి రావాల్సిన పేరు రాలేదట. అసలు తన గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. దీంతో సెకండ్ ఫిల్మ్ సింహాద్రి తీసినప్పుడు ఇది నా సినిమా అంటూ ఏ ఫిల్మ్ బై ఎస్ఎస్ రాజమౌళి అనే టైటిల్ లో వేశారు. అయితే చాలా మంది ఏ ఫిల్మ్ బై టీం అని వుండాలని సూచించారు. దీంతో రాజమౌళికి స్టాంప్ ఆలోచన వచ్చింది. సై సినిమాకి రాజమౌళి స్టాంప్ సింబల్ వేశారు. ఇది కొంచెం ఓవర్ గా వుందనే కామెంట్స్ వచ్చాయట. దీంతో తీసేద్దామని అనుకున్నారు. కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యేసరికి ఆయన నుంచి వచ్చే మరో సినిమాకి ఆ స్టాంప్ లేకపోతే బిజినెస్ పరంగా ఇబ్బంది వచ్చే అవకాశం వుందని బయ్యర్లు అదే స్టాంప్ ని కంటిన్యూ చేయమని చెప్పారు. దీంతో అలా రాజముద్ర ఫిక్స్ అయిపొయింది.

రమా రాజమౌళికి జరిగిన ఓ యాక్సిడెంట్ గురించి కాస్త ఫిలషాఫికల్ గా మాట్లాడారు జక్కన్న. ఇక్కడే కర్మ, రాజ, జ్ఞానం, భక్తి యోగాల ప్రస్థాన వచ్చింది. తనకి ఏ దిక్కూ తోచన పరిస్థితిలో కూడా దేవుడిని ప్రార్దించాలనే ఆలోచన రాలేదని, ఆ సమయంలో కూడా ఏ చేయాలి ? డాక్టర్ దగ్గరకు ఎలా చేరుకోవాలనే ఆలోచించానని గుర్తు చేసుకున్న రాజమౌళి.. బహుశా నేను కర్మయోగ కోవలో వస్తానేమో చెప్పారు.

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి సంబధించిన కొన్ని అన్ సీన్ ఫోటోలు, వీడియోలు కనిపిస్తాయి. అలాగే తన లవ్ స్టొరీ కూడా గురించి వుంటుంది. కీరవాణి జీడిపప్పు ఉప్మా పోలిక నవ్విస్తుంది. అలాగే డైరెక్టర్ గా తాను ఓ లాంచ్ ప్యాడ్ లాంటి వాడిని, తన హీరోలు రాకెట్స్ అని పోల్చుకున్నారు రాజమౌళి.

మగధీర గురించి రాజమౌళి రాజమౌళి, చరణ్ గురించి కొన్ని కొత్త విశేషాలు పంచుకున్నారు. తన ఫిల్మ్ మేకింగ్ లో కంటిన్యూటీ కంటే ఎమోషన్ కే ఎక్కువ ప్రాధన్యత ఇస్తానని చెప్పారు రాజమౌళి. ఈగ సినిమా విశేషాల తర్వాత బాహుబలి సంగతి తెరపైకి వచ్చాయి. ఆ సమయంలో బడ్జెట్ తగ్గించడానికి రాజమౌళి చేసుకున్న ఏర్పాట్లు స్ఫూర్తిదాయకంగా వుంటాయి. ఇక బాహుబలికి తెలుగు నెగిటివ్ టాక్ వచ్చిన అంశం కూడా ప్రస్తావనలోకి వచ్చింది. కట్టప్పని బానిసగా చిత్రీకరించిన వైనం గురించి వచ్చిన విమర్శకు ” నేను నా కథకు మాత్రమే బానిసని’ అని సమాధానం ఇచ్చారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ విశేషాలు కూడా ఆకట్టుకునేలా చూపించారు. ఆస్కార్ అందుకోవడంతో మోడ్రన్‌ మాస్టర్స్‌ క్లైమాక్స్ కి వస్తుంది. చివరికి రాజమౌళి కెప్టన్ చైర్ లో యాక్షన్ చెప్పే దృశ్యంతో న్యూ బిగినింగ్ లా మోడ్రన్‌ మాస్టర్స్‌ పూర్తవుతుంది.

అయితే ఈ డాక్యుమెంటరీ కామా (,)నే అనుకోవాలి. ఎందుకంటే ఒక డాక్యుమెంటరీలో విషయాలన్నీ సమగ్రంగా వుండాలి. కానీ ఈ డాక్యుమెంటరీ లో హైలెట్స్ ని చూపించుకుంటూ వెళ్ళినట్లు వుంటుంది. దాదాపు రెండు గంటల నిడివి వున్న డాక్యుమెంటరీ ఇది. దర్శకుడు రాఘవ్ ఖన్నా కేవలం కొన్ని హైలెట్స్ మీదే ద్రుష్టి పెట్టాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల మీద ఫోకస్ పెట్టారు కానీ మిగతా సినిమా గురించి పెద్ద ప్రస్తావన లేదు. కేవలం విజువల్ గా బ్రిలియంట్ గా వున్న సినిమాలనే ఎంచుకున్నారని అనుకోవాలి.

డాక్యుమెంటరీ అనేది నాన్ ఫిక్షన్. ఇలాంటి నా ఫిక్షన్ నెరేటివ్స్ లో కూడా ఒక ఎమోషనల్ డ్రైవ్ తీసుకోస్తుంటారు కొందరు డైరెక్టర్స్. యష్ చోప్రాపై రొమాంటిక్స్ అనే డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లోనే వచ్చింది. నాలుగు ఎపిసోడ్స్ వున్న ఆ డాక్యుమెంటరీలో ప్రొసీడింగ్స్ అన్నీ చాలా ఆర్గానిక్ గా వుంటాయి. ఒక క్యారెక్టర్ గురించి చెప్పే క్రమంలో సెట్ బాయ్ నుంచి కూడా బైట్ తీసుకుంటారు. ఒక సినిమా ఐడియా వచ్చిన క్రమం నుంచి అది విడుదలైన వరకూ జరిగే జర్నీని ఒక కథలానే ప్రజెంట్ చేస్తారు. ఈ విషయంలో ఈ డాక్యుమెంటరీ ఇంకాస్త డిటేయుల్ గా రాయాల్సింది. మేకర్స్ కూడా ఇంకాస్త గ్రౌండ్ వర్క్ చేయాల్సిందనిపించింది.

రాజమౌళి.. రవితేజ, నితిన్, నాని, సునీల్ లాంటి యాక్టర్స్ తో కూడా సినిమాలు చేశారు. బాహుబలిలో ఐకానిక్ గా నిలిచిన అనుష్క, రమ్యకృష్ణ లాంటి నటీమణులు వున్నారు. వీరంతా అక్కడక్కడా చిన్న చిన్న బైట్ లు ఫిల్ చేసినా ఇంకాస్త నిండుదనం వచ్చేది. అలాగే డాక్యుమెంటరీ ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ లో వుంది. సొంతగొంతుకలు వినాలంటే ఇంగ్లీష్ లో చూడటమే బెటర్.

రికార్డ్ చేయాల్సిన సినీ చరిత్ర రాజమౌళిది. ఇది ఆరంభం మాత్రమే. ఆయన క్రియేట్ చేసే అద్భుతాలు ఇంకా చాలా ఉండబోతున్నాయి. భవిష్యత్ లో వాటన్నిటి విశేషాలు ఇలా డాక్యుమెంటరీలుగా రావాలని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close