మహేశ్‌బాబు, రాజమౌళి ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా ఫస్ట్ ఈవెంట్ ఈ నెల 15న జరగనుంది. ఈలోగ సైలెంట్ గా ఓ సాంగ్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సాంగ్ ని శ్రుతి హాసన్ పాడటం విశేషం. ఆమె వాయిస్ కొత్త ఫ్లేవర్ ని యాడ్ చేసింది. సాహిత్యం రాసే బాధ్యతని చైతన్య ప్రసాద్ కి ఇచ్చారు.
కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే
వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే
ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే
రారా ధీర ధ్రువతార
రారా సైరా సంచార..
సాంగ్ బిగింగ్ లో వినిపించిన ఈ లిరిక్స్ సినిమా కోర్ ని ఎస్టాబ్లెస్ చేశాయి. కీరవాణి కంపోజిషన్ పవర్ ఫుల్ గా వుంది. ఒక రైజింగ్ ఎమోషన్ ని తెలియజేస్తే సాంగ్ ఇది. సాంగ్ లో వచ్చే చేంజ్ ఓవర్లు డిఫరెంట్ ఎమోషన్స్ ని ప్రజెంట్స్ చేశాయి. హీరోయిజం ని ఎలివేట్ చేస్తూనే అండర్ లైన్ గా ఒక ఎపిక్ టోన్ తో వున్నాయి.
ఈ సినిమాకి గ్లోబ్‌ట్రాటర్ వర్కింగ్ టైటిల్. గ్లోబ్‌ట్రాటర్ అంటే తరచుగా ప్రపంచం చుట్టూ ప్రయాణించే వ్యక్తిని అర్ధం. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే.. వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే…లాంటి లిరిక్స్ ఈ పదానికి సరైన న్యాయం చేస్తున్నాయి. చివర్లో సంచార అనే పదం కూడా ఒక టైటిల్ కి సరిపడే క్యాచి వర్డ్. ఈ సినిమాకి ప్రస్తుతం సంచారి, రుద్ర, వారణాసి అనే టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. 15న టైటిల్ పై క్లారిటీ వచ్చేసింది.

