మక్కాలో మహా విషాదం: 717మంది మృతి

హైదరాబాద్: సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. మక్కా నగరం శివార్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 700మందికి పైగా చనిపోయారు… 800మందిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల్లో హజ్ యాత్రలో ఇంత పెద్ద దుర్ఘటన జరగటం ఇది రెండోసారి. ఈ నెల 11న ఒక క్రేన్ కూలి 118మంది చనిపోయారు… 394మంది గాయపడ్డారు. నాటి మృతులలో తెలుగువారుకూడా ఉన్నారు.

ఇవాళ్టి దుర్ఘటన పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో అరాఫత్ కొండకు, మక్క మసీదుకు మధ్య ఉన్న మినావద్ద తొక్కిసలాట కారణంగా జరిగింది. హజ్ యాత్రలోని చివరి అంచెలో భాగంగా సైతాన్‌పై రాళ్ళు కొడుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. 4000మంది సిబ్బందిని ఘటనాస్థలానికి పంపామని సౌదీ అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని 4 ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్‌లకు పుణ్యక్షేత్రమైన మక్కాలో దుర్ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. 1990లో జరిగిన అతిపెద్ద తొక్కిసలాట దుర్ఘటనలో 1,426మంది చనిపోయారు. ఇవాళ్టి దుర్ఘటన జరిగిన సైతాన్‌పై రాళ్ళుకొట్టే ప్రదేశంలోనే ఎక్కువగా దుర్ఘటనలు జరుగుతుంటాయి. దీనినే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా చెబుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనా టైమ్ లోనూ… క‌నిక‌రించ‌డం లేదు!

క‌రోనా క‌ష్టాలు చిత్ర‌సీమ‌కు కుదిపేస్తున్నాయి. సినిమా రంగం ఈ ఉప‌ద్ర‌వం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే. చేయ‌గ‌లిగింది ఏమైనా ఉంటే, అది న‌ష్టాల్ని త‌గ్గించుకోవ‌డ‌మే. అందుకే కాస్ట్ కటింగ్‌, బ‌డ్జెట్ కంట్రోల్ అనే...

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

HOT NEWS

[X] Close
[X] Close