బడా సంస్థలు నిర్మించే గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు బెటరా.. స్టాండలోన్ అపార్టుమెంట్లో ఇల్లు బెటరా అన్నది చాలా మందికి వస్తున్న సందేహం. స్టాండలోన్ అపార్ట్మెంట్ అనేది ఒకే భవనంలో ఉండే నివాస యూనిట్. తిన్న బిల్డర్లు వీటిని నిర్మిస్తూ ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీలలో లభించే సౌకర్యాలు ఉండవు. ఒక డెవలపర్ లేదా యజమాని నిర్మిస్తున్నారు. ఆపార్టుమెంట్లలో ఉండేవారంతా కలిసి కమిటీగా ఏర్పడి నిర్వహించుకుంటారు.
స్టాండలోన్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలతో పోలిస్తే సాధారణంగా తక్కువ ధరలో లభిస్తాయి. ఇవి మధ్యతరగతి కుటుంబాలకు , తక్కువ బడ్జెట్లో ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలలో స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌస్ వంటి సౌకర్యాల నిర్వహణకు అధిక మొత్తంలో నెలవారీ ఛార్జీలు చెల్లించాలి. స్టాండలోన్ అపార్ట్మెంట్లలో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిబంధనల వల్ల కనీసం బంధువుల్ని ఇంటికి పిలిపించుకోవడం సమస్య అవుతుంది. స్టాండలోన్ అపార్టుమెంట్లలో ఈ సమస్య ఉండదు. స్టాండలోన్ అపార్ట్మెంట్లు నగర కేంద్రాల్లో ఉంటాయి. స్కూళ్లు, హాస్పిటల్స్, మార్కెట్లు, రవాణా సౌకర్యాలకు సమీపంలో ఉంటాయి, ఇది రోజువారీ జీవనాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలలో వందలాది ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి ఊరికి కాస్త దూరంగా ఉంటుంది.
మనుషులు అందరూ ఒకలా ఉండరు.. వారి అభిరుచులు కూడా వేరుగా ఉంటాయి. అయితే మధ్యతరగతి వారికి అత్యంత అనుకూలమైన నివసాలు..స్టాండలోన్ అపార్టుమెంట్లు అనుకోవచ్చు.