రెండు ప్రభుత్వాలవీ “వాస్తవ బడ్జెట్లే”..!

వాస్తవ బడ్జెట్…! ఈ పదం ఇప్పుడు తరచుగా వినిపిస్తోంది. లెక్కల పరంగా చూస్తే అసలు బడ్జెట్‌కు.. వాస్తవ బడ్జెట్‌కు.. తేడా చాలా ఉంది. మాది గొప్ప ఆర్థిక వ్యవస్థ… అని చెప్పుకోవడానికి ప్రభుత్వాలు ఇప్పటి వరకూ.. రాబడి అంచనాలు ఎక్కువగా వేసుకుని.. దానికి తగ్గట్లుగా ఖర్చులు కేటాయిస్తూ వెళ్తూంటాయి. ఉదాహరణకు గత ఏడాది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ. 2 లక్షల 26వేల కోట్ల వరకూ ఉంది. అంత పెద్ద మొత్తంలో ఆదాయం.. వస్తుందని..ఖర్చులు చేస్తామని.. లెక్కలు రాసుకున్నారు. పది నెలల కాలంలో.. అందులో ఖర్చు చేసింది.. 50 శాతానికి అటూఇటూగానే ఉంది. అంటే.. అంత ఆదాయం రావడం లేదు.. అంతగా ఖర్చు పెట్టడం లేదు. దీంతో.. అంచనాలు తప్పిపోతున్నాయి. తెలంగాణలోనూ అంతే.

అయితే.. కేసీఆర్.. చాలా వ్యూహాత్మకంగా ఓటాన్ అకౌంట్ పద్దు నుండి.. అసలైన బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పటికే..అంచనాలన్నీ తగ్గించేశారు. వాస్తవ బడ్జెట్‌ అంటూ.. కొత్త పద్దు ప్రవేశ పెట్టారు. ఈ లెక్క ప్రకారం.. ఇప్పుడు.. కేసీఆర్.. బడ్జెట్ అంచనాల్లో 95 శాతం లక్ష్యాన్ని సాధించారు. కానీ ఏపీలో మాత్రం ఇది కేవలం యాభై ఎనిమది శాత వరకే ఉంది. ఖర్చుకు, ఆదాయానికి.. అంచనాలకు పొంతన లేకపోవడంతో.. చివరికి..పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటూండంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే.. కేసీఆర్ వ్యూహాత్మకంగా వాస్తవ బడ్జెట్ వైపు మళ్లారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారు. రాని ఆదాయాలను.. బడ్జెట్‌లో చూపకుండా… వాస్తవ ఆదాయాలను.. దానికి తగ్గట్లుగా ఖర్చును.. చూపించాలని నిర్ణయించుకున్నారు అందుకే ఈ సారి ఏపీ బడ్జెట్ లెక్క తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా.. రెండు లక్షల కోట్ల కన్నా తక్కువగానే ఈ సారి ఏపీ బడ్జెట్ ఉండనుందని చెబుతున్నారు. ప్రజల్లో గొప్పల కోసం గతంలో.. ప్రభుత్వాలు… బడ్జెట్ సైజును పెంచి అంకెల గారడీ చేసేవి. ఈ సారి మాత్రం వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close