విచారణ పూర్తయ్యే వరకూ రాజధానిపై ” స్టేటస్ కో” ..!?

రాజధాని విషయంలో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ఏపీ హైకోర్టు తెలిపింది. రాజధాని పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి… గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత హైకోర్టులో పలు రకాల పిటిషన్లు పడ్డాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఈ స్టేటస్ కో ఎత్తివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం కలగలేదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో విచారణ పూర్తయ్యే వరకూ స్టేటస్ కో కొనసాగుతుంది. అందుకే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లింది. అయినా ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు విచారణ పూర్తయ్యే వరకూ స్టేటస్ కో కొనసాగే అవకాశం ఉంది.

స్టేటస్‌కోను సీఎం క్యాంప్ ఆఫీస్, స్టేట్ కమిషనరేట్‌ల విషయంలో వర్తింప చేయవద్దని ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. గతంలో సీఎం క్యాంప్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమగ్ర వివరాలతో శుక్రవారానికి అఫిడవిట్ వేయాలని… విచారించి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం సూచించింది. జూన్ 16, 17వ తేదీలలో రాజధాని బిల్లులపై అసెంబ్లీ, మండలిలో జరిగిన కార్యకలాపాలను తెప్పించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు వేసిన పిటిషన్‌లో వాదనలు వినిపించిన న్యాాయవాది జంధ్యాల కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా వాటిని ఆమోదింపచేసుకున్నారని ఆడియో, వీడియో ఫుటేజీతోపాటు బ్లూ పేపర్స్, బిల్స్ రిజిస్టర్ లను కూడా తెప్పిస్తే మొత్తం విషయం బయటపడుతుందన్నారు. దీంతో ధర్మాసనం శుక్రవారానికి మొత్తం వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ కేసును ముందుగా విచారించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాజధానికి సంబంధించి కోస్తా, రాయలసీమ ప్రజల తరపున ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు లాయర్లు పిటిషన్లు వేశారు. వారి అభ్యర్థనలను కోర్టు అంగీకరించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close