ఏపీ ఇంటెలిజెన్స్ బాస్… తెలంగాణ నుంచి వ‌స్తున్నారా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ ర‌వీంద్ర వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేడ‌ర్ కు చెందిన ఈ అధికారిని ఏపీకి బ‌దిలీ మీద తీసుకెళ్లాలనే ఆలోచ‌నలో జ‌గ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదే అంశమై ఏపీకి కాబోయే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌వీంద్ర‌ను ఐదేళ్లపాటు డెప్యుటేష‌న్ మీద ఆంధ్రాకి పంపించాల‌ని తాజాగా కేసీఆర్ ను జ‌గ‌న్ కోరిన‌ట్టు వినిపిస్తోంది. మొన్న‌నే, సీఎం కేసీఆర్ ను జ‌గ‌న్ మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రూ దాదాపు 15 నిమిషాల‌పాటు ఏకాంతంగా చ‌ర్చించుకున్నారు. ఈ స‌మ‌యంలోనే ర‌వీంద్ర‌ను ఏపీకి పంపించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్ ముందు జ‌గ‌న్ ఉంచార‌ట‌! అయితే, దీనికి సంబంధించిన ఆదేశాలు కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. ఆ ప్ర‌య‌త్నం కూడా వైకాపా నేతలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

కాబోయే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఢిల్లీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానితో భేటీ అయిన‌ప్పుడే కొంత‌మంది ఉన్న‌తాధికారుల బ‌దిలీలు, మార్పుల గురించి జ‌గ‌న్ మాట్లాడిన‌ట్టు వైకాపా వ‌ర్గాలు అంటున్నాయి. జ‌గ‌న్ తో పాటు వైకాపా ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లిన‌వారిలో ఉన్నారు. స్టీఫెన్ ర‌వీంద్ర డెప్యుటేష‌న్ విష‌య‌మై హోంశాఖ‌కు చెందిన కొంత‌మంది ఉన్న‌తాధికారుల‌తో వైకాపా ఎంపీలు మాట్లాడిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా వారికి సానుకూల సంకేతాలే అందాయ‌ట‌! ర‌వీంద్ర విష‌య‌మై తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాలు విడివిడిగా ప్ర‌తిపాద‌న‌లు పంపిస్తే త‌ప్ప‌కుండా సానుకూలంగా స్వీక‌రిస్తామ‌ని హోం శాఖ‌కు చెందిన అధికారులు వైకాపా ఎంపీల‌తో చెప్పిన‌ట్టుగా స‌మాచారం.

ఇంత‌కీ… స్టీఫెన్ ర‌వీంద్ర‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఏపీ ఇంటెలిజెన్స్ కి ఎందుకు తీసుకొస్తున్నార‌నేదే చ‌ర్చ‌! ఈయ‌న వైయ‌స్ కుటుంబంతో స‌న్నిహితంగా ఉంటారని అంటారు. అంతేకాదు, ఆ మ‌ధ్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయ‌మైన డాటా చోరీ కేసును ప‌రిష్క‌రించే బృందం ర‌వీంద్ర నేతృత్వంలోనే ప‌నిచేసింది. ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఆ కేసులో కొన్ని ఆధారాలు దొర‌కాయంటూ అప్ప‌ట్లో గుస‌గుస‌లు చాలా వినిపించాయి. ఆయ‌న్నే ఇప్పుడు ఇంటిజెన్స్ ఛీఫ్ గా తేవాల‌నుకునే ప్ర‌తిపాద‌న కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. పైగా, దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తున్న‌ట్టుగా క‌థ‌నాలొస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close