అచ్చెన్నపై స్టింగ్ ఆపరేషన్..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా ఆ వీడియోలను చూస్తే… చంద్రబాబు, లోకేష్‌కు అచ్చెన్నాయుడు మధ్య దూరం పెంచేలా ఉండే కొన్ని సంభాషణలను ప్రత్యేకంగా అందులో ఉంచినట్లుగా స్పష్టమవుతోంది. భోజనం చేస్తూ.. తనతో మాట్లాడటానికి వచ్చిన వారితో అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో అది. అందులో అచ్చెన్నాయుడుతో తన గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి.. తన ఫోన్ ఎత్తడం లేదని… ముఫ్పై ఏళ్లు సర్వీస్ చేశానని… చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు కూడా పదిహేడో తేదీన ఎన్నికలు అయిపోతాయని.. తర్వాత ఫ్రీ అయిపోతామన్నారు.

తర్వాత ఏ సందర్భంలో అన్నారో కానీ.. పార్టీ లేదు.. బొక్కా లేదు అనే వాయిస్ కూడా వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ కు మూడు రోజుల ముందు ఈ వీడియో బయటకు రావడం…కుట్రపూరితంగా వైసీపీ పన్నిన పన్నాగంగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్ని కుట్రలు పన్నినా.. తిరుపతిలో తెలుగుదేశం విజయాన్ని ఆపలేరని.. చంద్రబాబు, లోకేష్‌తో తనుకున్న అనుబంధాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు ప్రైవేటుగా ఎలా మాట్లాడతారో పార్టీలో ఉన్న వారందరికీ తెలుసు.

అదే సమయంలో టీడీపీపై ఆయన నిబద్ధతను కూడా ఎవరూ శంకించలేరని ఆ పార్టీలో నేతలు చెబుతూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా ప్రైవేటుగా మాట్లాడిన సంభాషణలను ఎడిటింగ్ చేసి.. తిరుపతి ఉపఎన్నిక ముందు బయట పెట్టి… టీడీపీలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అప్రమత్తంగా లేకుండా స్టింగ్ ఆపరేషన్‌కు చాన్సిచ్చిన అచ్చెన్నాయుడుకు ఇది ఇబ్బందికరమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close