కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే …. డ్రగ్స్ పేరుతో దొరికిన ఓ తీగను.. తెలంగాణ వైపు మళ్లించి రాజకీయంగా గేమ్ ప్రారంభించిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల కోసమే .. ఎక్కువగా మీడియాలో లీకులు ఇచ్చి.. అందులో పేర్లున్న వారిపై రకరకాల ప్రచారాలు చేస్తారు. వారిని ఒత్తిడికి గురి చేస్తారు. వారు టార్గెట్ చేసిన పార్టీపై విమర్శలు గుప్పిస్తారు. చివరికి అలాంటి నేతలు..బీజేపీలో చేరితే అంతా సైలెంటయిపోతుంది. బెంగాల్లో శారదా స్కాంలో అదే వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు… తెలంగాణలో డ్రగ్స్ కేసును అలా వాడుకుంటున్నారా అన్న చర్చ ప్రారంభమయింది.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ కేసులో ఉన్నారని కొద్ది రోజుల కిందట.. తెలుగు మీడియాకు బెంగళూరు పోలీసులు లీక్ చేశారు. కానీ ఎవరి పేర్లూ చెప్పలేదు. ఓ యువ ఎమ్మెల్యే.. మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎమ్మెల్యే… మరో విద్యా సంస్థల అధినేత ఇలాంటి లీకులు ఇచ్చి.. మొత్తానికి వారెవరో అందరికీ తెలిసేలా ప్రచారం చేశారు. నేడో రేపో నోటీసులంటూ హంగామా చేశారు. కానీ .. సైలెంటయ్యారు. మళ్లీ కొత్తగా ఇంకా చాలా మంది ఉన్నారంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు పోలీసులు తెలుగు మీడియాకు ఇంటర్యూలు కూడా ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. తమ పార్టీ టార్గెట్‌గా డ్రగ్స్ కేసును ఉపయోగించుకుని ఏదో చేయబోతున్నారన్న అనుమానాలు ఆ పార్టీలో ప్రారంభమయ్యాయి.

భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో బలపడాలంటే వాటికి ఎక్కువగా సాయం చేసింది.. దర్యాప్తు సంస్థలే. రాజకీయ నేతలన్న తర్వాత… వారి వెనుక లూప్ హోల్స్ ఉండకుండా ఉండవు. వాటిని పట్టుకుని అందర్నీ బీజేపీలో చేర్పించే పనిలో చాలా కాలంగా దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరిస్తున్నాయన్నది తెర ముందున్న రహస్యమే. అలాంటి ప్లాన్లే.. ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. డ్రగ్స్ కేసు సీరియస్ ఇష్యూ కాబట్టి.. ఎవరైనా అందులో అనుమానితులు బీజేపీలో చేరితే మాత్రం… గేమ్ ప్రారంభమయినట్లుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close