చంద్రబాబుపై అంబటి రాంబాబు తిట్టిన చిట్ల అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ప్రభుత్వం మారిన తర్వాత జుగుప్సాకరమైన భాషకు చోటు లేకుండా ప్రభుత్వం చేసింది. అంతుముందు ఐదేళ్ల పాటు ఎన్ని తిట్లను టీడీపీ నేతలు తిన్నా.. చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచినా.. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. అందర్నీ కంట్రోల్ లో ఉంచారు. కానీ వైసీపీ నేతలు ఇది చేతకాని తనం అనుకుంటున్నారు. చేతకాని తనాన్ని ప్రజల ముందు పెట్టి తమ విచ్చలవిడి తనాన్ని చూపించాలనుకుంటున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని నిరూపించాలని అనుకుంటున్నారు. చట్టపరంగా ఎదుర్కోవడం అనేది చేతకానితనం కాదు అనేది ఇప్పుడు ప్రభుత్వం, వ్యవస్థలు చూపించాల్సి ఉంది. అంబటి రాంబాబే కాదు మరొకరు ఏ పార్టీ వారైనా అలా మాట్లాడాలంటే.. భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలి.
చట్టప్రకారమే వెళ్లడం చేతకానితనం కాదు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదేళ్ల పాటు అరాచక పాలన, అసభ్య పదజాలంతో అట్టుడికిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత హుందాతనంతో, ఎక్కడా ప్రతీకార రాజకీయాలకు తావులేకుండా పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టీడీపీ నేతలు ఎన్ని అవమానాలు భరించినా, చంద్రబాబు తన శ్రేణులను కంట్రోల్లో ఉంచి వ్యవస్థల ద్వారానే పరిష్కారం వెతికారు. కానీ, ఈ హుందాతనాన్ని వైసీపీ నేతలు తమ చేతకానితనం గా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి నేతలు మరోసారి గీత దాటి, బూతులతో విరుచుకుపడుతూ రాజకీయాలను జుగుప్సాకరంగా మారుస్తున్నారు.
వ్యవస్థలకు బహిరంగ పరీక్ష!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పరమపదించిన తల్లిదండ్రులపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా, అరెస్టు చేస్తే చేసుకోండి అని ఆయన చేస్తున్న సవాళ్లు చూస్తుంటే.. ప్రభుత్వం తమను ఏమీ చేయలేదన్న ధీమా లేదా అరెస్టు ద్వారా సానుభూతి పొందాలన్న వికృత వ్యూహం కనిపిస్తోంది. చట్టపరంగా వెళ్లడం అంటే చేతకానితనం కాదు, ప్రజాస్వామ్య గౌరవం అని ఇప్పుడు ప్రభుత్వం , పోలీస్ వ్యవస్థలు చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే, ఈ బూతు రాక్షసులు మరింతగా రెచ్చిపోయి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.
అంబటికి ఇచ్చే ట్రీట్ మెంట్ ఒక హెచ్చరిక కావాలి!
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. గుంటూరులో ఆయన ఇంటిపై జరిగిన దాడులు ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో దాడులు పరిష్కారం కాదు.. చట్టం ఇచ్చే శిక్షే శాశ్వత పరిష్కారం. భవిష్యత్తులో ఏ పార్టీ నేత అయినా ఇలాంటి భాష వాడాలంటే వణికిపోయేలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లడ్డూ ప్రసాదం కల్తీ కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఈ అసభ్యకర అస్త్రం ప్రయోగించినట్లు స్పష్టమవుతోంది. తమ నేతలను అరెస్టు చేయించి, తద్వారా అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై అపవాదు వేయాలన్నది వారి ప్లాన్. ప్రభుత్వం ఈ కుట్రను చిత్తు చేస్తూనే, అంబటి రాంబాబుకు చట్టం రుచి చూపించాల్సి ఉంది. వ్యవస్థలు తన పని తాను చేస్తున్నాయని .. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపించాల్సి ఉంది.
కనీవినీ ఎరుగని శిక్షే ఏకైక మార్గం
అంబటి రాంబాబు చేసిన ఈ నేరపూరిత వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని దూషించడం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర గౌరవాన్ని, రాజకీయ సంప్రదాయాలను కాలరాయడమే. అందుకే, కేవలం నామమాత్రపు కేసులు కాకుండా, ఆయన చేసిన వ్యాఖ్యల తీవ్రతకు తగ్గట్టుగా, చట్టంలోని గట్టి సెక్షన్ల కింద కఠిన శిక్ష పడేలా చూడాలి. ఈ బూతు రాక్షసులను కంట్రోల్ చేయాలంటే అంబటి రాంబాబుకు వేసే శిక్షే ఒక మైలురాయిగా నిలవాలి. అప్పుడే ఏపీ రాజకీయాల్లో మళ్లీ హుందాతనం నెలకొంటుంది. లేకపోతే వైసీపీ రాక్షస మూకలు రెచ్చిపోతూనే ఉంటాయి.
