రోహిత్ కి న్యాయం జరగాలి..విద్యార్ధుల చదువులు కొనసాగాలి

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మరణంపై నేటికీ కొందరు విద్యార్ధులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. వారు రోహిత్ మరణానికి భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ కి న్యాయం జరిగే వరకు తరగతులు జరగడానికి వీలులేదని వారు వాదిస్తుంటే, తక్షణమే తరగతులు మొదలుపెట్టాలని మరి కొందరు విద్యార్ధులు వాదిస్తున్నారు. ఇది ఆ రెండు వర్గాల మధ్య మరో సరికొత్త వివాదానికి, ఘర్షణకి దారి తీస్తోంది. ఇప్పటికే రోహిత్ మరణం కారణంగా యూనివర్సిటీలో విద్యార్ధుల మధ్య దూరం పెరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సమస్యను సృష్టించుకోవడం ఎవరికీ మంచిది కాదు.

రోహిత్ మరణం తరువాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రాజకీయ నాయకుల హడావుడి బాగా పెరిగిపోయింది. అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు పోలీసులు కూడా మొహరించి ఉన్నారు. ఈ కారణంగా విద్యార్ధులు ఇంకా ఆవేశంగానే ఉన్నారు. యూనివర్సిటీలో విద్యార్ధి సంఘాలు రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉన్నందున, ఆయా పార్టీల నేతలు వచ్చి వారిని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వాడుకొనే ప్రయత్నంలో దిశానిర్దేశం చేసి వెళుతుంటారు. కనుక యూనివర్సిటీకి రాజకీయ నాయకుల తాకిడి తగ్గితే కానీ పరిస్థితులు చక్కదిద్దడం చాలా కష్టమేనని భావించవచ్చును.

వైస్ ఛాన్సిలర్ అప్పారావు శలవుపై వెళ్ళిపోయాక, ఇటువంటి తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో విపిన్ శ్రీవాత్సవ యాక్టింగ్ వైస్ ఛాన్సిలర్ గా బాధ్యతలు చేపట్టి, యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్ది మళ్ళీ తరగతులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రోహిత్ కోసం పోరాటం చేస్తున్న విద్యార్ధులు ఆయనను కూడా పదవిలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన తప్పుకొనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అంటే అవదనే చెప్పవచ్చును. అప్పారావు శలవుపై వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కానప్పుడు విపిన్ శ్రీవాత్సవ తప్పుకొంటే అవదని అందరికీ తెలుసు. కానీ రోహిత్ మరణంతో విద్యార్ధులలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఆవిధంగా బయటపెట్టుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది.

వేధింపుల కారణంగా రోహిత్ మరణించడం చాలా దురదృష్టకరమే. అందుకు బాధ్యులపై తప్పకుండా కటిన చర్యలు తీసుకోవలసిందే. కానీ అదే సమయంలో మిగిలిన విద్యార్ధులు ఈ రాజకీయ నాయకుల ప్రభావం నుండి బయటపడి, తమ చదువులపై దృష్టి పెట్టకపోతే చివరికి వారే తీవ్రంగా నష్టపోతారు తప్ప రాజకీయ నాయకులు కాదని గ్రహించాలి. కనుక వారి మాటలను నమ్మి తమ చదువులను, విలువయిన సమయాన్ని, తద్వారా తమ భవిష్యత్ ని పణంగా పెట్టడం మంచిదో కాదో విద్యార్ధులే నిర్ణయించుకోవలసి ఉంటుంది. యూనివర్సిటీలో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడి తరగతులు మొదలవ్వాలంటే విద్యార్ధుల సహకారం చాలా అవసరం.

ఆందోళన చేస్తున్న విద్యార్ధులు అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నవారే. వారికి ఈ రాజకీయ నాయకుల తీరు, వారి ఉద్దేశ్యాల గురించి తెలియదనుకోలేము. అలాగే వాస్తవిక దృక్పధంతో ఆలోచించినట్లయితే సాధారణంగా ఇటువంటి సమస్యలని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మెల్లగా ఏవిధంగా పక్కనపెట్టేస్తాయో తెలుసుకోవచ్చును. మన ప్రజాస్వామ్యంలో ఈ అసమానతలు నేటికీ, ఎన్నటికీ కూడా నెలకొనే ఉంటాయని రోహిత్ ఘటన మరోసారి రుజువు చేయబోతోంది. బ్రష్టు పట్టిపోయిన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఆ అసమానతలను సరిచేయడం దాదాపు అసంభవం కనుక న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్ధులు తమ పరిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం కోసం కృషి చేయాలి. కనుక వారు విపిన్ శ్రీవాత్సవ రాజీనామాకు పట్టుబట్టడం కంటే యూనివర్సిటీలో మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి మార్గదర్శకాలు రూపొందించేలా ఒత్తిడి తెస్తే దాని వలన ఏమయినా ప్రయోజనం ఉంటుంది. విద్యార్ధులు తమ చదువులను నిర్లక్ష్యం చేసి రాజకీయ నాయకులను నమ్ముకొంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడమే అవుతుందని గ్రహించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close