కృష్ణవంశీ ‘రుద్రాక్ష’లో కథానాయిక మారిందా..!

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరక్షన్లో వస్తున్న సినిమా ‘రుద్రాక్ష’. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనుంది. అయితే కథానాయికా ప్రాధాన్యత గల ఆ సినిమాలో ముందు అనుష్కను హీరోయిన్ గా అనుకున్నా ఆమెను కాదని ఇప్పుడు ఆ అవకాశం సమంతకు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అరుంధతి నుండి కథానాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న అనుష్క నిన్న మొన్నటి రుద్రమదేవి వరకు ఆ ప్రస్థానం కొనసాగించింది.

అయితే రుద్రాక్ష సినిమాలో సమంత అంటూ న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ నుండి అనుష్క తప్పుకోవడానికి కారణాలు ఏమో గాని సమంత ఈ సినిమాను ఓకే చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎందుకంటే ఇన్నాళ్లు అందం అభినయం ఇంకా గ్లామర్ పాత్రల్లోనే నటించిన సమంత మొదటిసారి కెరియర్ లో కథానాయికా ప్రాధాన్యతతో కూడిన థ్రిల్లర్ సినిమాలో నటిస్తుందా అని అందరు ఆశ్చర్యపడుతున్నారు.

సమంత ఒప్పుకోవడానికి కారణం దిల్ రాజు అని కొందరంటుంటే.. మరికొందరు ప్రస్తుతం కథానాయికలు అంతా కొత్త కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే త్రిష, హాన్సిక, నయనతార ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న వారే కాబట్టి వారి దారిలోనే సమంత కూడా లీడ్ రోల్ సినిమా చేసేందుకు సిద్ధమైందని చెబుతున్నారు. మరి ప్రెస్టిజియస్ గా వస్తున్న ఈ రుద్రాక్షతో సమంత హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com