సుద్దాల ఆప‌రేష‌న్ స‌క్సెస్‌

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. శ‌నివారం ఆయ‌న‌కు కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. సుద్దాల త‌నయుడు అర్జున్ తేజ్ కాలేయ దానం చేశారు. దాంతో సుద్దాల అశోక్ తేజ‌కు జ‌రిగిన ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయ్యింద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. శనివారం ఉద‌యం మొదలైన ఆప‌రేష‌న్ సాయింత్రం వ‌ర‌కూ సాగింద‌ని, సుద్దాల‌, ఆయ‌న త‌న‌యుడు ఇద్ద‌రూ క్షేమంగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. గీత ర‌చ‌యిత‌గా సుద్దాల బ్రాండ్ ప్ర‌త్యేకం. దేశ‌భ‌క్తి, జాన ప‌ద‌, భావోద్వేగ పాట‌ల‌కు ఆయ‌న ప్ర‌సిద్ధి. `ఠాగూర్‌`లోని నేను సైతం ప్ర‌పంచాగ్నికి పాట‌కు ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌గా జాతీయ పుర‌స్కారం పొందారు. శ్రీ‌శ్రీ త‌ర‌వాత ఆ ఘ‌న‌త సాధించిన తెలుగు ర‌చ‌యిత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close