సుధాకర్ వాంగ్మూలం : పక్కా స్కెచ్ ప్రకారమే చేశారు..!

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికకు.. విశాఖ సెషన్స్ జడ్డి…రెండున్నర గంటల పాటు ప్రశ్నించి సమర్పించిన వాంగ్మూలానికి తేడా ఉండటంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. సంబంధిత పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి.. ఎనిమిది వారాల్లోగా.. రిపోర్ట్ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. దీంతో సహజంగానే.. ఆ న్యాయమూర్తి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఏముందన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఆ వివరాలు బయటకు రావడంతో.. డాక్టర్ సుధాకర్‌ను ప్లాన్ ప్రకారం టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డాక్టర్ సుధాకర్ న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో మొత్తం.. తన సస్పెన్షన్‌కు దారి తీసిన పరిస్థితులు.. ఆ తర్వాత విశాఖలో జరిగిన పరిణామాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా న్యాయమూర్తికి తన వాంగ్మూలంలో వివరించారు. ఎన్-95 మాస్కుల విషయంలో..తాను ఎలా పై అధికారులతో గొడవ పడింది.. ఆ విషయం మీడియాకు ఎలా తెలిసిందన్నదానిపై మొత్తం ఆయన వెర్షన్ అంతా వినిపించారు. అంబులెన్స్ డ్రైవర్ ద్వారా సస్పెన్షన్ ఆర్డర్స్ పంపిచారని..చెప్పిన సుధాకర్.. ఆ తర్వాత తనకు అనేక మంది వ్యక్తుల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్ గురించివి వరించారు.

విశాఖలో పరిణామాలు జరగడానికి అసలు మొదటగా.. తన కుమారుడి బైక్‌ను ఇద్దరు అపరిచిత వ్యక్తులు…లాక్ డౌన్ ఉల్లంఘించారంటూ.. సీజ్ చేయడంతోనే ప్రారంభమయిందని.. వివరించారు. పోలీసులు బైక్ సీజ్ చేసిన మూడు రోజుల తర్వాత తాను విషయం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే..తన చేయిని పట్టుకుని అరచి గోల చేసిన మహిళా కానిస్టేబుల్..తనపైనే ఎదురు కేసు పెట్టి.. శాశ్వతంగా ఉద్యోగం తీయించేస్తానని హెచ్చరిచిందని సుధాకర్ తన వాంగ్మూలంలో తెలిపారు. ఆ తర్వాత తాను వ్యక్తిగత పని మీద వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వెంటాడరని.. ఆ కారణంగా తాను తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నానన్నారు. మూత్ర విసర్జన కోసం ఆగిన సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వచ్చి రెచ్చగొట్టారని చెప్పారు. ఆ తర్వాత తనపై దాడి జరిగిందని..కారులో ఉన్న రూ.పది లక్షలు తీసుకుని మద్యం బాటిళ్లు పెట్టారని వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత చేతులు వెనక్కి నెట్టిగచ్చుపై పడేశారని.. బలవంతంగా మెంటల్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు..

సుధాకర్ వాంగ్మూలం ప్రకారం చూస్తే.. ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ.. ఆయనను ఈ వ్యవహారంలో ఇరికించినట్లు స్పష్టమవుతుందని..న్యాయవర్గాలు చెబుతున్నాయి. పోలీసు వెర్షన్ వేరేలా ఉంది.సీబీఐ విచారణలో నిజం ఏమిటోనిగ్గు తేలే అవకాశం ఉంది. ఘటన జరిగిన పరిణామాలన్నింటినీ… వాటి వెనుక ఉన్న వ్యక్తుల కదలికలు ఆరాతీస్తే..చాలా కేసు చిక్కుముడి మొత్తం విడిపోతుందని.. క్రిమినల్‌లాలో పండిపోయిన వారు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

శ్రీవారి దర్శనాలపై టీటీడీ వర్సెస్ రమణదీక్షితులు..!

తిరుమల, తిరుపతిల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో శ్రీవారి దర్శనాల నిలిపివేత అంశం మరో సారి హాట్ టాపిక్ అయింది. భక్తుల వద్ద నుంచి ఎలాంటి డిమాండ్లు లేవు. దర్శనాలకు యథావిధిగా భక్తులు...

రౌడీ మ‌రో రికార్డ్‌!

వ‌రుస విజ‌యాల‌తో, త‌న ఆటిట్యూడ్ తో లెక్క‌లేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. సోష‌ల్ మీడియాలో.. త‌న ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌దు. దానికి సాక్ష్యంగా నిలిచింది ఇన్‌స్ట్రా గ్రామ్‌. ఇన్‌స్ట్రాలో ఏకంగా 8...

రాధేశ్యామ్ నేర్చుకున్న ‘సాహో’ పాఠం

గ‌త వైఫ‌ల్యాల నుంచి పాఠాలు నేర్చుకోపోతే ఎలా? పరాజ‌యం అనేది విజ‌యానికి నాందిలా మారాలంటే.. త‌ప్పుల్ని స‌రిదిద్దుకోవాల్సిందే. యూవీ క్రియేష‌న్స్ ఇప్పుడు అదే ప‌ని చేస్తోంది. యూవీ చేతిలో చాలా ప్రాజెక్టులు...

HOT NEWS

[X] Close
[X] Close