సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ ఒక పబ్లిసిటీ గిమ్మిక్. అవి ఒరిజినల్ నెంబర్స్ కావు. ‘మా వ్యాపారాన్ని మేమే ఎందుకు బయటపెట్టుకుంటాం. మీకు చూపిస్తున్నందంతా ఒత్తిదే. ఇవేవే ఒరిజినల్ కాదు’ అని స్వయంగా నాగవంశీ లాంటి నిర్మాతలు ఓపెన్ చెబుతుంటారు. అయినప్పటికీ కలెక్షన్స్ పోస్టర్స్ హడావిడి ఆగదు.
తాజాగా ఈ సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. కలెక్షన్స్ పోస్టర్స్ ని తేలిగ్గా తీసిపారేశారు.
”సినిమా రెండో రోజే 120 కోట్లు పోస్టర్ వెయ్యమని మా వాళ్లకు సరదాగా చెబుతుంటాను. ఆ నెంబర్ ఎవడికి కావాలి. ఈ పోస్టర్ల పంచాయితీ వద్దని గిల్డ్ లో అనుకున్నాం. ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ నెంబర్స్ తో ఎవరికీ అవసరం లేదు. ఆ చిత్రమైన నెంబర్స్ ఎవరికీ అర్థం కూడా కావు. ఆడియన్స్ కి ఈ నెంబర్లు, పోస్టర్లు అక్కర్లేదు. ఇవన్నీ సినిమా బూస్టింగ్ కోసం చేసుకున్నవే’అని అసలు విషయాన్ని ఓపెన్ గా చెప్పారు.
మరో కీలక విషయాన్ని ప్రస్థావించారు. సంక్రాంత్రికి ఓ రెండు సినిమాలు వెనక్కి తగ్గివుంటే డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరిగేది. అన్నీ సినిమాలని వాళ్ళపై రుద్దేశం. ఈ ట్రెండ్ అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
