సుధీర్ బాబు జటాధర ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా ఫిక్స్ అయింది. దర్శకుడు రాహుల్ రవీంద్రతో ఓ సినిమా చేయనున్నాడు సుధీర్. ఈ సినిమా గురించి సుధీర్ బాబు చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటివరకు వరల్డ్ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదట. బడ్జెట్ సంగతి చెప్పలేను కానీ కాన్సెప్ట్ పరంగా ఇదొక బాహుబలి అంటూ ఆసక్తిని పెంచాడు.
అన్నట్టు..జటాధరలో మహేష్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. “మహేష్ బాబు ఇందులో కనిపించరు. శివుడిగా కృష్ణగారిని చూపించాలని అనుకున్నాం, కానీ సిజీకి సమయం సరిపోలేదు. ఇందులో ఎవరి ఎక్స్పీరియన్స్ ఉండదు” అని క్లారిటీ ఇచ్చేశారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ టాపిక్ కూడా వచ్చింది. ఆ సినిమా చేయాలి కానీ ఎందుకో చాలా బ్రేకులు పడుతున్నాయని చెప్పారు. “ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్ననేను ఇరవై సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. అయితే నేను పడుతున్న కష్టానికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.