నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్ లో సుధీర్ బాబు చేస్తున్న సినిమా ‘మామా మశ్చీంద్ర’. ఇందులో త్రిపాత్రభినయం చేస్తున్నాడు సుధీర్ బాబు. ఇప్పటికే లడ్డు బాబు లుక్ బయటికి వచ్చింది. అంత లావుగా సుధీర్ బాబుని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పుడు మరో లుక్ వదిలారు. ఈ లుక్ రజనీకాంత్ కబాలి సినిమాని గుర్తుకు తెచ్చింది. వయసుపై బడిన గ్యాంగ్ స్టార్ అవతారం, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్, సిట్టింగ్ స్టయిల్ అన్నీ కబాలిలానే వున్నాయి.
సుధీర్ బాబు ఇలా మూడు గెటప్పులో కనిపించడం ఇదే తొలిసారి. హర్ష వర్ధన్ మంచి డైలాగ్ రైటర్, విక్రమ్ కుమార్ సినిమాల విజయాల్లో ఆయనది కీలక పాత్ర. ఇప్పుడు స్వయంగా మెగాఫోన్ పట్టారు. అటు సుధీర్ బాబు కూడా వరుసగా అపజయాలు ఎదురుకొన్నారు. మొన్న వచ్చిన హంట్ మరీ దారుణమైన ఫలితం ఇచ్చింది. మామా మశ్చీంద్ర’ సుధీర్ బాబు కెరీర్ కి చాలా కీలకమైన సినిమా కానుంది.