గవర్నర్‌తో వివాదాలే కేసీఆర్ కోరుకుంటున్నారా ?

తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా ఇబ్బంది పెట్టాలని కేంద్రం అనుకోవడం లేదు. కానీ గవర్నర్‌తో ఆ మాత్రం విభేధాలు ఉండాలని తెలంగాణ సర్కార్ కోరుకుంన్నట్లుగా కనిపిస్తోంది. గవర్నర్‌పై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లడం సంచలనంగా మారింది. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గర అని.. తమిళిసై ఈ విషయం తెలిసి వ్యాఖ్యానించారు. అంటే ఆమె.. కేవలం.. ఆమె బిల్లులు ఆమోదించాలని సీఎస్ వచ్చి అడిగి ఉంటే చాలని అనుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ సీఎస్ మాత్రం .. ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా గవర్నర్ తో మర్యాదపూర్వక భేటీకి కూడా సిద్ధంగా లేరు.

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదం బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య సానుకూల వాతావరణం ఏర్పడలేదని స్పష్టయింది. ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఢిల్లీకి వెళ్లే బదులు రాజ్ భవన్‌కు రావాల్సిందని గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. సీఎస్ అసలు గౌరవించడం లేదని ఆమె అంటున్నారు. దీంతో అసలు సమస్య ఏమిటన్నది రాజకీయ వర్గాలకూ అంతుబట్టడం లేదు.

బడ్జెట్ సమావేశాల దగ్గర సఖ్యత కుదిరినా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు కల్పించాల్సిన ప్రోటోకాల్ కల్పించకపోవడంతోనే గవర్నర్ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ తనను మర్యాదపూర్వకంగా కూడా కలవడం లేదని.. ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని భావిస్తున్నారు. మామూలుగా కొత్త సీఎస్ వస్తే గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ సీఎస్ శాంతి కుమారి కలవలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో హైకోర్టు ఆదేశాల మేరకు పాల్గొన్నారు కానీ.. ప్రత్యేకంగా సమావేశం కాలేదు. అలాగే గవర్నర్ ..రాజకీయం చేస్తున్నారని ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న భావనలో బీఆర్ఎస్ నేతలుున్నారు. దీంతో వివాదం మళ్లీ ప్రారంభమయిందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close