తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి ‘గుడ్ – బ్యాడ్ – అగ్లీ’ అనే పేరు పెట్టారు. ఇందులో ముగ్గురు హీరోయిన్ల‌ని తెలుస్తోంది. ఓ క‌థానాయిక‌గా శ్రీ‌లీల ఎంపిక దాదాపుగా ఖాయ‌మైంది. మ‌రో ఇద్ద‌రు వెట‌రన్ భామ‌లు క‌నిపించ‌నున్నారు. ఓ పాత్ర‌లో మీనా, మ‌రో పాత్ర‌లో సిమ్రాన్ న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా హీరో పాత్ర మూడు విభిన్న‌మైన కోణాల్లో, గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్న‌ట్టు టాక్‌. తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ఇలా మూడు త‌రాల్నీ… అజిత్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. అందుకోసం లుక్ టెస్ట్ కూడా పూర్త‌య్యింది. ఇప్పుడు క‌థానాయిక‌లు, ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

తాత పాత్ర ప‌క్క‌న సిమ్రాన్‌, తండ్రి పాత్ర కోసం మీనా మ‌న‌వ‌డి కోసం శ్రీ‌లీల‌ని ఎంచుకొన్నార‌ని స‌మాచారం. అజిత్ తో శ్రీ‌లీల‌కు ఇదే తొలి సినిమా. అయితే సిమ్రాన్ ఇది వ‌ర‌కే.. ‘వాలి’ చిత్రం కోసం అజిత్ తో జోడీ క‌ట్టింది. అంత‌కు ముందు ‘అవ‌ల్ వ‌రువాలా’లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఇది మూడో సినిమా అవుతుంది. మీనా కూడా గ‌తంలో రెండు చిత్రాల్లో అజిత్ స‌ర‌స‌న న‌టించింది. ఇది మీనా, సిమ్రాన్ ల‌కు అజిత్ తో హ్యాట్రిక్ సినిమా. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. అప్పుడే పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close