సుహాస్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘హే భగవాన్’. లిటిల్ హార్ట్స్ తో ఆకట్టుకొన్న శివానీ నాగారం హీరోయిన్. నరేష్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 20న విడుదల అవుతోంది. ఈరోజు `నాట్ ఏ ట్రైలర్` విడుదల చేశారు.
ఈ సినిమాలో హీరో ఫ్యామిలీ చేసే బిజినెస్ ఏమిటి? అనే క్యూరియాసిటీని రేకెత్తించారు. టీజర్ లో అది చెప్పలేదు. ఇంటర్వ్యూలలోనూ అది బయటపెట్టలేదు. ఇప్పుడు ఈ ట్రైలర్ లోనూ చెప్పలేదు. అదేమిటో తెరపైనే చూడాలి అంటోంది చిత్రబృందం. బిజినెస్ ఏమిటో చెప్పలేకపోయినా.. అదేదో క్రేజీ విషయమే అయ్యేట్టు ఉందన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ మొత్తం ఫన్ రైడ్ లా సాగింది. సుహాస్ కామెడీ టైమింగ్ మరోసారి వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. ఈసారి సుదర్శన్, నరేష్‌లు కూడా యాడ్ అయ్యారు. నరేష్ క్యారెక్టర్లు పేలిన సినిమాలన్నీ ఈమధ్య బాగానే ఆడాయి. సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో నరేష్ పాత్ర బాగా పేలింది. ఈ సినిమాలోనూ ఆయన క్యారెక్టర్ బాగా వచ్చిందని టాక్. కామెడీ సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడుతున్నాయి. కాస్త పబ్లిసిటీ చేసుకొంటే చాలు. ‘హీరో చేసే బిజినెస్ ఏమిటి’ అనే యాంగిల్ లో చిత్రబృందం కూడా వెరైటీ పబ్లిసిటీ చేస్తోంది. అవన్నీ ఈ సినిమాకు కలసి రావాలి.
