తెలుగులో విభిన్న చిత్రాలు చేస్తున్న హీరో సుహాస్. చిన్న నిర్మాతలూ, కొత్త దర్శకులకు తను కేరాఫ్ అడ్రస్స్ అయ్యాడు. ఈసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టాడు. ‘మందాడి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో స్పోర్ట్స్ డ్రామా. తమిళ నటుడు సూరి కీలక పాత్రధారి. తెలుగు నుంచి ఈ సినిమా కోసం సుహాస్‌ని తీసుకొన్నారు. ఈ సినిమాలో సుహాస్ లుక్ ఈ రోజు రివీల్ చేశారు. లుక్ పరంగా సుహాస్ ఆకట్టుకొన్నాడు. తనకు ఇదో కొత్త తరహా సినిమా అవ్వబోతోందన్న భరోసా ఈ పోస్టర్ తో కలుగుతోంది. సునామీ రైడర్స్ టీమ్ కెప్టెన్ గా సుహాస్ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ పాజిటీవ్నా, నెగిటీవ్నా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు దర్శక నిర్మాతలు.
వెట్రిమారన్ ఈ చిత్రానికి ఒకానొక నిర్మాత. వెట్రిమారన్ మార్క్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలన్నీ ‘రా’ అండ్ ‘రస్టిక్’గా ఉంటాయి. ఈ సినిమా కథ కూడా అలాంటిదే అని టాక్. స్పోర్ట్స్ డ్రామాల్ని చాలా సజహంగా, ఎమోషనల్ డ్రైవ్ తో తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో.. అలాంటి సినిమానే ఇది అని చిత్రబృందం చెబుతోంది. టెక్నికల్ టీమ్ సపోర్ట్ కూడా ఈ సినిమాకు ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎస్.ఆర్.కార్తీక్ కెమెరా వర్క్ అందించారు. మట్రిమారన్ పుకజ్హిందీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.