ప్ర‌భాస్ 100 టీబీ హార్డ్ డిస్క్ లాంటివాడు: సుజిత్ కాంప్లిమెంట్‌

ప్ర‌భాస్ గురించి సుజిత్ ఓ కొత్త విష‌యం చెప్పాడు. ప్ర‌భాస్‌కి ప్ర‌తీ విష‌యం గుర్తు ఉంటుంద‌ని.. రెండేళ్ల క్రితం చెప్పిన విష‌యం కూడా.. గుర్తు పెట్టుకుని, చెబుతుంటాడ‌ని, త‌నో 100 టీబీ హార్డ్ డిస్క్ లాంటివాడ‌ని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతే కాదు.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని కూడా మెచ్చుకున్నాడు. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఓపిక ఎక్కువ‌ని, రెండేళ్ల త‌ర‌వాత సినిమా ఇస్తున్నా.. ఓపిగ్గా ఎదురుచూస్తున్నార‌ని, అందుకే ప్ర‌భాస్ అభిమానుల్ని `డైహార్డ్ ఫ్యాన్స్‌` గా అభివ‌ర్ణించాన‌ని చెప్పుకొచ్చాడు. సాహో ప్రీ రిలీజ్ వేడుక‌లో సుజిత్ మాట్లాడుతూ…

‘‘ ఈ సినిమాలో డైహార్డ్ ఫ్యాన్స్ అని ఓ డైలాగ్ రాశాను. అది ప్ర‌భాస్ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని రాసిందే. ప్ర‌తీ హీరోకీ అభిమానులు ఉంటారు. కానీ.. ప్ర‌భాస్ అభిమానులకు చాలా ఓపిక ఎక్కువ‌. బాహుబలి’ తర్వాత వెంటనే ప్రభాస్‌ నుంచి సినిమా రావాలని ఫ్యాన్స్‌ అనుకుంటారు. కానీ, రెండేళ్లు ఎంతో ఓపికగా వేచి చూశారు. షార్ట్‌ ఫిలింస్‌ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒక షార్ట్‌ ఫిలింకు సంబంధించిన డీవీడీని ప్రభాస్‌ అన్న చూసి, నన్ను పిలిపించారు. అప్పుడు నేను ‘మిర్చి’సినిమా చూస్తున్నా. ప్రభాస్‌ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. సరదాగా అన్నారేమోనని అప్పుడు వెళ్లలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు వెళ్తే, ‘ఏంటి.. డార్లింగ్‌ అప్పుడు పిలిస్తే రాలేదు’అన్నారు. ఆయన మైండ్‌ పెద్ద హార్డ్‌డిస్క్‌. నాలుగేళ్ల కిందట కూడా చెప్పినవి ఆయనకు గుర్తు ఉంటుంది. ట్రైలర్‌ చివరిలో ప్రభాస్‌ అన్న తలలో నుంచి రక్తం వస్తూ ఉండే సన్నివేశం ఉంటుంది. తొలుత ఈ షాట్‌ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు కూడా ఆయన ఆ షాట్‌ను గుర్తు పెట్టుకున్నారు. రాజమౌళిగారి సినిమా తర్వాత ప్రభాస్‌ చిత్రం చేయడమంటే సముద్రానికి ఎదురు ఈదడమే. కానీ, నాపై ప్రభాస్‌కు ఎంతో నమ్మకం ఉంది. అందుకే ప్రోత్సహించార“న్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com