సినిమా కోసం ఆయుష్షు తగ్గించుకునే దర్శకుడు!

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ గురించి రామ్ లక్ష్మణ్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా వున్నాయి. ”సినిమా కోసం, ప్రేక్షకుడికి వినోదం పంచుకోవడం కోసం ఆయుష్షు తగ్గించుకునే దర్శకుడు సుకుమార్. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు లేకపోవడం ఇదే మొదటిసారి చూశాం. సినిమాని గొప్పగా చూపించడం కోసం ప్రస్తుతం ముంబాయ్ లో వున్నారు సుకుమార్. ఇది చాలు సినిమాపై సుకుమార్ కి వున్న కసిని చెప్పడానికి” అని చెప్పుకొచ్చారు రామ్ లక్ష్మణ్

ఇంకో ఆసక్తికరమైన సంగతి కూడా రివిల్ చేశారు. ” ఆర్య సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ సరిగ్గా రాకపోతే చిన్నపిల్లాడిలా ఏడ్చాడు సుకుమార్. ఆ రోజు కొత్తవాడు కదా.. అనుకున్నాం. కానీ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా పుష్ప షూటింగ్ లో ఓ సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. సినిమా పట్ల సుకుమార్ కి వున్న తపన చూస్తే ముచ్చట వేస్తుంది” అన్నారు.

ఇక బన్నీ గురించి మాట్లాడుతూ..బున్నీకి వచ్చిన సక్సెస్ క్రెడిట్ మొత్తం దేవుడికి ఇచ్చేయాలి. ఎందుకంటే అంత సక్సెస్ ని మోయడం మనిషి వల్ల కాదు. అందుకే దేవుడి ఖాతాలో వేసేస్తేనే బన్నీకి తేలికగా వుంటుంది” అని తమదైన ఫిలాసఫీని కూడా జోడించారు రామ్ లక్ష్మణ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close