అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా `పుష్ష‌`లో మ‌రో యాంక‌ర్ సుమ‌కి సుకుమార్ స‌రికొత్త ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది. సుమ యాంక‌ర్ గా సుప‌రిచితురాలు. కొన్ని సినిమాలూ చేసింది. కాక‌పోతే.. యాంక‌ర్‌గా వ‌చ్చిన పేరు న‌టిగా మాత్రం రాలేదు. సుమ కూడా న‌ట‌న కంటే యాంక‌రింగ్‌పైనే దృష్టి పెట్టి ఆ రంగంలో నెంబ‌ర్ వ‌న్ అయ్యింది. అలాంటి సుమ‌ని మ‌ళ్లీ వెండి తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

వీటిపై సుమని సంప్ర‌దిస్తే… `అలాంటిదేం లేదు..` అని తేల్చేసింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆ వార్త‌ల్లో రిజం లేద‌ని తేల్చేశారు. మొత్తానికి తెలిసిందేంటంటే సుమ ఈసినిమాలో న‌టించ‌డం లేదు. అలాంటి ఆఫ‌ర్ కూడా సుమ‌కి రాలేదు. కాక‌పోతే అన‌సూయ‌కు మాత్రం ఓ అదిరిపోయే పాత్ర ద‌క్కింది. మ‌ళ్లీ రంగ‌మ్మ‌త్త మ్యాజిక్ క్రియేట్ చేయ‌డానికి సుకుమార్ గ‌ట్టి ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి ఈ వార్త ఎలా పుట్టిందో మ‌రి?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close