‘మేం ఫేమస్తో’ ఫేమస్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. తన రెండో సినిమా ‘గోదారి గట్టుపైన’. నిధి కథానాయిక. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. టీజర్ ఈరోజు విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టుగానే గోదావరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అక్కడి స్నేహితులు, సరదాలు, వాటి మధ్య నడిచే ప్రేమకథలా మలిచారు. ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల ఆట.. పాటలూ, అల్లర్లు ఈ సినిమాలో చూడొచ్చు. సుమంత్ ప్రభాస్ లుక్ కుర్రాళ్లు ఓన్ చేసుకొనేలా వుంది. నిధి చూడ్డానికి బాగుంది. వాళ్లిద్దరి కెమిస్ట్రీ ఈ కథకు ప్లస్. కథలోని సంఘర్షణ ఏమిటన్నది టీజర్ లో చూపించలేదు కానీ, సున్నితమైన లవ్ స్టోరీకి, గోదావరి ఎమోషన్ ని జోడించారన్నది మాత్రం అర్థం అవుతోంది.
జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల.. ఇలా స్టార్ కాస్టింగ్ బాగానే ఉంది. సుదర్శన్ కామెడీ బాధ్యతను తన భుజాలపై వేసుకొన్నాడు. తన డైలాగులే ఈ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. ‘మణిరత్నం, గౌతమ్ మీనన్ టచ్ చేయని కాంబినేషన్ రా ఇది’ అనే డైలాగ్ ఫన్నీగా కుదిరింది. ఇది సంక్రాంతి సీజన్. దానికి తగ్గట్టుగానే కోడిపందాల హడావుడి ఈ టీజర్లో కనిపించింది. చిన్న సినిమాలు ఈమధ్య బాగా స్కోర్ చేస్తున్నాయి. కాస్త ప్రమోషన్ చేసుకోగలిగితే చాలు. ప్రేక్షకుల్ని రప్పించే అవకాశం ఉంది.
