సందీప్ కిష‌న్ రేంజు పెరిగిందా?

నిను వీడ‌ని నీడ‌ను నేనేతో కాస్త ఫామ్‌లోకి వ‌చ్చాడు సందీప్ కిష‌న్‌. రేపు `తెనాలి రామ‌కృష్ణ బి.ఏ, బి.,ఎల్‌` విడుదల కాబోతోంది. టైటిల్ ఎఫెక్టో, కామెడీ సినిమా అనో, లేదంటే సందీప్ హిట్టు కొట్టాడ‌నో తెలీదు గానీ, ఈ సినిమాకి బిజినెస్ బాగానే జ‌రిగింది. శాటిలైట్‌తో క‌లుపుకుని దాదాపు 7 కోట్ల‌కు బిజినెస్ పూర్త‌యింది. సందీప్ రేంజుకి ఇది ఎక్కువే అని చెప్పాలి. ట్రైల‌ర్లు ఆక‌ట్టుకోవ‌డం, టైమ్ పాస్ సినిమా అనే గ్యారెంటీ క‌ల‌గ‌డంతో బిజినెస్ బాగానే జ‌రిగింది. అంతేకాదు.. కొన్ని జిల్లా కేంద్రాల‌లో ఈ సినిమా ప్రీమియ‌ర్లు వేస్తున్నారు. ఈరాత్రే ప్రీమియ‌ర్లు మొద‌లైపోతాయి. స్టార్ హీరోల సినిమాల‌కే ప్రీమియ‌ర్లు వేయ‌డానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డిపోతుంటారు. టాక్ బ‌య‌ట‌కు వ‌స్తే.. ఉద‌యానికి క‌ల్లా థియేట‌ర్లు ఖాళీ అయిపోతాయ‌ని భ‌యం. కానీ కేవ‌లం సినిమాపై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఈ ధైర్యం చేశారు. చాలా రోజుల త‌ర‌వాత హ‌న్సిక మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌నుంది. ఆమె గ్లామ‌ర్ ఈసినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close