శ్రీ‌దేవి రేఖ‌ల‌కు ఏఎన్నార్ అవార్డులు

దివంగ‌త తార శ్రీ‌దేవికి ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారం ల‌భించింది. 2018గానూ శ్రీ‌దేవికి ఈ అవార్డు ప్ర‌క‌టించారు. 2019కి గానూ రేఖ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈనెల 17న హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో ఈ పుర‌స్కార ప్ర‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులు అంద‌జేస్తారు. శ్రీ‌దేవి త‌ర‌పున‌ బోనీక‌పూర్‌, జాన్వీక‌పూర్ ఈ అవార్డు స్వీక‌రిస్తారు. అవార్డు కింద రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు, జ్ఞాపిక కూడా అంద‌జేస్తారు.

నాన్న‌గారి కోరిక‌

శ్రీ‌దేవికి త‌న పేరుమీదున్న అవార్డు ఇవ్వాల‌న్న‌ది నాన్న కోరిక అన్నారు నాగార్జున‌. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌లేద‌ని, ఇన్నాళ్ల‌కు ఆమెకు అవార్డు అందివ్వ‌గ‌లుగుతున్నామ‌న్నారు. రేఖ‌తో కూడా నాన్న‌కి మంచి అనుబంధం ఉంద‌ని, అందుకే అవార్డు సంగ‌తి చెప్ప‌గానే రేఖ త‌ప్ప‌కుండా వ‌స్తానని మాట ఇచ్చార‌ని నాగ్ చెప్పారు. ఇదే కార్య‌క్ర‌మంలో అన్న‌పూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేసిన 70 మంది విద్యార్థుల‌కు ప‌ట్టాలు అందివ్వ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close