యాక్ష‌న్‌లోకి దిగిన‌ అయాన్‌.. అర్హ‌

గురువారం `అల వైకుంఠ‌పుర‌ములో` ఓ పాట‌కియ సంబంధించిన టీజ‌ర్‌ విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ముందే ప్ర‌క‌టించింది. ఈ టీజ‌ర్‌లో ఓ స‌ర్‌ప్రైజ్ కూడా ఉంటుంద‌ని చెప్పింది. ఆ స‌ర్‌ప్రైజ్ ఏమిటో రివీల్ అయిపోయింది. ఈ పాట టీజ‌ర్ వ‌చ్చేసింది. `ఓ మైగాడ్ డాడీ` టీజ‌ర్లో ముందే అనుకున్న‌ట్టు అయాన్‌, అర్హ‌లు క‌నిపించారు. ఓ డాడీ డాడీ అంటూ… బ‌న్నీ ఫ్లెక్సీ ముందు అల్ల‌రి చేశారు. అయాన్ చిన్న చిన్న స్టెప్పులు వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, అర్హ – క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. ఇరోజు బాల‌ల దినోత్స‌వం క‌దా. బ‌న్నీ పిల్ల‌ల‌తో ఈ టీజ‌ర్ క‌ట్ చేయ‌డం టైమ్లీగా అనిపించింది. పూర్తి పాట 22న వ‌స్తోంది. మ‌రి ఆ పాట మేకింగ్ వీడియోలోనూ వీళ్లిద్ద‌రూ ఉంటారా, లేదా అనేది చూడాలి. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.