మత ముద్రవేస్తున్నా బీజేపీని ఏమీ అనలేకపోతున్న వైసీపీ..!

ఇష్టమైనవాడి నుంచి వచ్చే దుర్వాసన కూడా సువాసనగానే అనిపిస్తుందట..! ప్రస్తుతం.. బీజేపీ నుంచి వచ్చే. తిట్లు, శాపనార్థాలు, విమర్శలు..వైసీపీ నేతలకు అలాగే అనిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ కావాలని చేస్తుందో.. ప్రభుత్వ పెద్ద దృష్టిలో పడాలని కింది స్థాయి నేతలు అత్యుత్యాహానికి పోతున్నారో కానీ.. వరుసగా మత వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులు, అన్యమత ప్రచారం… కలకలం రేపుతూండగానే… కొత్త కొత్త వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్‌గా హైలెట్ చేస్తోంది. ముఖ్యంగా కన్నా లక్ష్మినారాయణ.. వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడుతున్నారు.

తాజాగా.. విజయవాడలో దుర్గమ్మ గుడి దిగువన ఉండే బెరం పార్కుకు శిలువతో కూడుకున్న ఏసుక్రీస్తు, మరియమాత బొమ్మలను చిత్రీకరించారు. అన్నవరం, తిరుపతి, శ్రీశైలంలో అన్యమతప్రచారం, భీమిలీ ఉత్సావాలలో మతపరమైన స్టాళ్ల ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ బీజేపీ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్తోంది. కనీ వైసీపీ నుంచి ఒక్కటంటే.. ఒక్క కౌంటర్ రావడం లేదు. బీజేపీ నేతల్ని ఏమన్నా.. ఆ ఎఫెక్ట్ ఢిల్లీ నుంచి కనిపిస్తుందని.. వైసీపీ అగ్రనాయకత్వం ఆందోళనతో ఉంది. అందుకే.. బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా.. స్పందించవద్దని.. పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం పంపారు. అంతే కాదు.. ఎవరైనా బీజేపీ కేంద్రనేతలు ఏపీకి వస్తే .. వారికి రాచమర్యాదలు చేస్తున్నారు. కిషన్ రెడ్డికి సన్మానం చేసి.. స్నేహం కోరుకుంటున్నామని వినయంగా విజ్ఞప్తి చేసుకోవాల్సి వచ్చింది.

అయితే.. బీజేపీ నేతలు అగ్రెసివ్ చేస్తున్న క్రిస్టియన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. దీన్ని ఇప్పటికిప్పుడు తిప్పికొట్టలేని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని బీజేపీ మరింత దూకుడుగా వెళ్తోంది. ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కానీ అగ్రనాయకత్వం అనుమతి ఇవ్వకుండా.. బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. కనీసం.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని కూడా.. ఏమీ అనలేని పరిస్థితి ఇటీవలి కాలంలో ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close