ఎఫెక్ట్ ఏపీపైనే కాదు.. ఇండియా మొత్తంపై..!

ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. సింగపూర్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గడంతో.. ఇతర విషయాలపైనా.. ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఏపీనే కాదు.. ఇండియా బ్రాండ్ ఇమేజ్ ను జగన్ దెబ్బతీశారన్న అభిప్రాయం ఆయా పత్రికల్లో వచ్చింది. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి సింగపూర్ ప్రభుత్వం వైదొలిగిన వ్యవహారం.. అంతర్జాతీయ పత్రికల్లోనూ హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయలే. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో… గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలు.. విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేత వంటి అంశాలు.. ఇతర దేశాల్లోనూ హైలెట్ అయ్యాయి.

దానికి కారణం.. విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులను… ఆయా దేశాల నుంచి రావడమే. దీనిపై జపాన్ .. ఓ సారి కేంద్రానికి ఘాటు లేఖ రాసింది. ఇలాంటి చర్యల వల్ల పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని హెచ్చరించిది. నిజంగానే… పీపీఏల విషయంలో ప్రభుత్వ నిర్ణయం తర్వాత అంతర్జాతీయ పెట్టుబడిదారులు.. కేంద్రం వద్ద తమ పెట్టుబడులకు అనేక రకాల గ్యారంటీలను కోరుతున్నారు. దీంతో… ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..ఇతర దేశాల్లో పర్యటించినప్పుడల్లా… ఏపీలో పీపీఏలకు వచ్చినటు వంటి పరిస్థితి ఇతరులకు రానివ్వబోమని.. తమది భరోసా అని చెబుతూ వస్తున్నారు. కానీ చేతల్లో మాత్రం…విదేశీ పెట్టుబడిదారులకు ఇబ్బందికర నిర్ణయాలు వెలువడుతూనే ఉన్నాయి.

ఏపీ సర్కార్ వైపు నుంచి… అంతర్జాతీయంగా కలకలం రేపే నిర్ణయాలు మాత్రం ఆగడం లేదు. కొత్తగా.. విశాఖలో ఉన్న మెడ్‌టెక్ జోన్ సీఈవోను ప్రభుత్వం సాగనంపింది. నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా.. పలు అంతర్జాతీయ సంస్థలు మెడ్ టెక్ జోన్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గట్టి షాక్ ఇస్తుందని… పత్రికలు తేల్చేశాయి. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం..అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేసింది. పలు ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. కొత్త ప్రభుత్వం … వాటన్నింటినీ రద్దు చేస్తూండటంతో… ఆ వ్యవహారం.. అంతర్జాతీయంగానూ.. ఏపీకే కాదు.. దేశానికి కూడా చెడ్డపేరు తెస్తోందన్న అభిప్రాయం.. పారిశ్రామిక వర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close