ఇసుక దీక్షపై ఇసుక చల్లుతున్న వైసీపీ..!

చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక చల్లుతోంది. ఈ రోజు నుంచే.. ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం.. దానికి తగ్గట్లుగా అధికార యంత్రాంగం మొత్తాన్ని ఇసుకపైనే.. ఉంచాలని నిర్ణయించారు. ఇంత కాలం ఇసుక కొరత వల్ల వచ్చిన ఇబ్బందుల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత సహజంగానే ఉంటుంది కాబట్టి.. ఆ ఇసుక కొరత.. చంద్రబాబు,లోకేష్ వల్లేనని చెప్పాలన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలు.. చిత్ర, విచిత్రమైన వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగా.. బ్లూ ఫ్రాగ్ అనే ఓఐటీ కంపెనీపై దాడి చేశారు. ఆ కంపెనీపై వచ్చిన ఫిర్యాదు ఏమిటంటే.. శాండ్ సర్వర్‌ను హ్యాక్ చేసి.. నో స్టాక్ బోర్డులు చూపించేలా చేస్తోందట. ఇలా చేస్తోందని మీడియాకు చెప్పుకొచ్చారు కానీ.. ఫిర్యాదు వచ్చిందని.. సోదాలు చేశామని… రెండు, మూడురోజుల తర్వాతే ఏం జరిగిందో తెలుస్తుందని.. సీఐడీ పోలీసులు చెబుతున్నారు. సీఐడీ సోదాల ఆధారంగా వెంటనే… లోకేష్ కు ముడిపెట్టేసి.. జగన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. గతంలో.. డేటాచోరీ కేసు విషయంలోనూ ఈ కంపెనీని తెరపైకి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఇసుక విషయంలోనూ ఆ కంపెనీని వాడుకుంటున్నారు.

ఇసుక దీక్షకు రెండు రోజుల ముందు నుంచే తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలు, చంద్రబాబు దీక్షపై పాటను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న వైసిపి నేతల 60మంది పేర్లతో చార్జ్ షీట్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం, మరికొంతమంది గుండె పోటు తో మరణించిన వారి వివరాలను తెలుగుదేశం విడుదల చేసింది. వీరి కుటుంబాలకు 25లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఉచిత ఇసుక రావాలి, ఇసుక మాఫియా పోవాలి అంటూ పోస్టర్లును కూడా టీడీపీ నేతలు విడుదల చేశారు.

చంద్రబాబు గతంలో ధర్మపోరాట దీక్షతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 12గంటల దీక్ష చేశారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇసుక కొరత, వైసిపి దాడులను నిరసిస్తూ పోరాటాలను ప్రారంభించింది. పోరాటాన్ని ఉధృతం చేసి ఆయా వర్గాలను ఆకట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే వైసీపీ నేతలు.. వీలైనంతగా.. ఎదురుదాడి చేసేందుకు సీఐడీ పోలీసుల్ని కూడా వాడుకుంటున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close