జనవరి 9న సునీల్ – వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి ఆడియో

తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్ ల తో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ ఇప్పుడు ‘కృష్ణాష్టమి’ అనే సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాడు.

వాసు వర్మ దర్శకత్వం లో, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 9 న రాజమండ్రి లో ని GIET కాలేజీ లో చాలా గ్రాండ్ గా చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ” మా బ్యానర్ లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం ఉంది. రాజమండ్రి లో 9న ఆడియో ని రిలీజ్ చేసి, చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజ్ చేస్తాము”, అని దిల్ రాజు అన్నారు.

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, ” ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్”.

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

దర్శకత్వం – స్క్రీన్ప్లే – వాసు వర్మ . నిర్మాత – రాజు . సహ నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ – చోటా కె. నాయుడు . ఎడిటర్ – గౌతం రాజు . సంగీతం – దినేష్ . కథ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ – అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ – ఎస్. రవీందర్. నిర్మాణం – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close