జగన్‌పై కోర్టు ధిక్కరణ చర్యలకు బార్ అసోసియేషన్ల డిమాండ్..!

న్యాయవ్యవస్థను బెదిరించడానికే… తన కేసుల్లో వ్యతిరేక తీర్పులు చెప్పకుండా బ్లాక్‌మెయిల్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీజేఐకి కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేసి.. లేఖ రాసి…దాన్ని మీడియాకు విడుదల చేశారని న్యాయవాదుల సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఆలిండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లు తమ స్పందన వ్యక్తం చేశాయి. జగన్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ చీఫ్‌జస్టిస్‌కు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి.. దాన్ని మీడియాకు విడుదల చేయడం వెనుక కుట్ర ఉందని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని… జగన్‌పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ఆలిండియా బార్ అసోసియేషన్‌ కోరింది.

న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా జగన్‌ చర్యలు ఉన్నాయని… తన కేసుల్లో కోర్టుల చర్యలను నిలువరించేందుకే.. జగన్‌ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆలిండియా బార్ అసోసియేషన్‌ విమర్శించింది. రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన ముఖ్యమంత్రి.. జడ్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్‌పై అవినీతి, మనీలాండరింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయిని … ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ కేసులను ఎన్వీ రమణ విచారిస్తున్న సమయంలో.. జగన్‌ లేఖ రాయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్వీ రమణ కుటుంబ సభ్యులపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదును ఖండిస్తున్నామని ఆలిండియా బార్ అసోసియేషన్‌ ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తీరును ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.

జగన్ సీజేకు రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం అసంబద్ధమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. న్యాయసూత్రాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని .. న్యాయవ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణకు, స్వతంత్రతకు.. జగన్ తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న జగన్‌.. ఇటువంటి చర్యలు చేయడం హేయమని నిరసన వ్యక్తం చేసింది. జగన్‌పై చర్యలుతీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close