ఏబీవీ సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు !

ఏబీ వెంకటేశ్వరరావును సర్వీస్‌లోకి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సివిల్ సర్వీస్ అధికారుల్ని రెండేళ్లకు మించి సస్పెన్షన్‌లో ఉంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. బీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను 2020 మేలోనే హైకోర్టు కొట్టి వేసింది. ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. యనపై సస్పెన్షన్ వేటు వేసి గత ఫిబ్రవరికే రెండేళ్లు దాటిపోయింది. సివిల్ సర్వీస్ అధికారులను రెండేళ్లకు మించి సస్పెన్షన్‌లో ఉంచాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా ఉండాలి. ఇప్పటి వరకూ ఈ విషయంలో కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగించడం సాధ్యం కాదని స్ఫష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టి వేసింది.

సుప్రీంకోర్టు చెప్పిందని ఏబీవీని ప్రభుత్వం సర్వీసులు తీసుకుంటుందా అంటే.. డౌటేనని చాలా మంది అభిప్రాయం. ఏబీవీని ప్రభుత్వంలోకి ఎట్టి పరిస్థితుల్లోకి ప్రభుత్వ పెద్దలు అంగీకరించరంటారు. ఆయన వ్యవస్థలోకి వస్తే ఏం జరుగుతుందోనని వాళ్లకు ఆందోళన ఉండటం సహజమంటున్నారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తుందా లేకపోతే.. ఇంకైదనా కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అన్నది కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close