మూడు రాజధానులు చట్టం కోర్టులో నిలబడదా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే అమరావతి రాజధాని అన్నది ముగిసిన అధ్యాయం కాదని, న్యాయవ్వస్థ పరిధిలోకి వెళితే జగన్ తీసుకున్న నిర్ణయం, చేసిన చట్టం కోర్టులో నిలబడవని, వైఎస్ఆర్ సీపీ చేసిన చట్టంలో పలు లోపాలు ఉండడమే దీనికి కారణం అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ ఒక ఛానల్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బాగా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రాజధాని మార్పే.‌ వికేంద్రీకరణ మంచిది అని కొన్ని జిల్లాల వారు అంటుంటే, అమరావతి రాజధానిగా కొనసాగించటం మంచిదని మరి కొన్ని జిల్లాల వారు అంటున్నారు. రాజధాని ని మార్చడం అన్నది జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అని కొందరు అంటుంటే, చంద్రబాబు తన పాలించిన ఐదేళ్లలో అమరావతి ని రాజధానిగా కేంద్ర గెజిట్ లో పొందుపరచి ఉంటే ఇప్పుడు ఈ నిర్ణయం జగన్ తీసుకునే ఉండేవారు కాదని, ఒకరకంగా చంద్రబాబు అప్పుడు చేసిన పొరపాట్లు అమరావతి రైతులకు శాపంగా మారాయని మరికొందరు అంటున్నారు. అయితే ప్రజల చర్చ ఇలా ఉంటే న్యాయకోవిదుల చర్చ మరొకలా ఉంది.

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ ఒక ఛానల్ డిబేట్ లో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులు బిల్లు ఆమోదం , సీీఆర్డీఏ రద్దు బిల్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవని, ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం విభజించినప్పుడు చేసిన ఆంధ్ర్ర్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో “క్యాపిటల్” అని మాత్రమే ఉందని, క్యాపిటల్స్ అని కాదని, రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిన పునర్విభజన చట్టానికి లోబడి ఉండాలని ఆయన అన్నారు. అదేవిధంగా, అసెంబ్లీ పెట్టినంతమాత్రాన లెజిస్లేటివ్ రాజధాని అంటే అయిపోదు అని, హై కోర్టు వేరే చోటకి తరలించి, అది న్యాయ రాజధాని అంటే అది కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. హై కోర్టు పెట్టే అధికారం రాష్ట్ర పరిధిలో ఉండదని, అది కేవలం ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కే ఉంటుంది అని వ్యాఖ్యానించిన ఆయన, వీటన్నింటిని బట్టి పరిశీలిస్తే రాజ్యాంగ బద్దంగా మూడు రాజధానులు అన్నది కోర్టులో నిలబడక పోవచ్చునని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, ఆర్ధిక బిల్లులు కానివి ఏవైనా అసెంబ్లీ లో పాసై, మండలిలో తిరస్కరణకు గురైతే సవరణలతో మళ్ళీ పంపాలని, ఒకవేళ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి నిర్ణయిస్తే అలా చేయకుండా శాసనమండలిని కాదని, రెండోసారి అసెంబ్లీ లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన విశ్లేషించారు. మొత్తానికి ఈ రెండు బిల్లులు రాజ్యాంగ బద్దంగా లేవు అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ముక్తాయించారు.

ఏది ఏమైనా అమరావతి రాజధాని అన్నది ముగిసిన అధ్యాయం కాదని, న్యాయ పరమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్న నేపథ్యంలో ” పిక్చర్ అభీ బాకీ హై దోస్త్” అన్నట్లుగా మున్ముందు పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో ఏకంగాాా రాజకీయ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేే స్థాయి నాయకులే కోర్టుల ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, జడ్జీలను అవమానిస్తూ మాట్లాడడం వంటిి వాటిపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిిన సంగతి తెలిసిందే. మరిిిి ఈ నేపథ్యంలో మూడు రాజధానుల భవిష్యత్తు ఏమతుంది అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close