సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు మొదటి విచారణలోనే… హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ సారి తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు ఖాయమని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం మొండి పట్టుదలకు మూల్యం చెల్లించుకున్నట్లయింది.

వాస్తవానికి గతంలోనే సుప్రీంకోర్టు ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. రంగులు తొలగించాలన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే.. ఆ తీర్పునూ.. ప్రభుత్వం మరో రకంగా అన్వయించుకుని రంగులకు కొత్త అర్థాలు చెబుతూ జీవో ఇచ్చింది. దానిపైనా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు… రాష్ట్ర ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు చెప్పినా.. రంగులు తీసేయకుండా.. కొత్త కొత్త కారణాలు చెబుతూ… జీవోలు జారీ చేయడం.. కోర్టు ధిక్కరణగా పరిగణించింది. గత నెల ఇరవై ఎనిమిది లోపు రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట‌‌్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో సీఎస్ నీలం సహాని.. సహా సీనియర్ అధికారులు హైకోర్టు ముందు హాజరై.. క్షమాపణలు చెప్పారు. కోర్టును ధిక్కరించే ఉద్దేశం లేదని.. తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని చెప్పుకున్నారు. సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. ఇవాళ విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు.. సూటిగా రంగులు తీసేయాలలని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది. రంగుల విషయంలో ఏపీ సర్కార్.. అత్యంత పట్టుదలగా ఉంది. తమ పార్టీ రంగులు ఉండాల్సిందేనన్నట్లుగా కోర్టులను కూడా లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పు పైనా.. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారంటే… ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఇప్పుడు కూడా.. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ప్రభుత్వం పాటిస్తుందన్న నమ్మకం లేదని.. ఏదో దొడ్డిదోవ మార్గాన్ని ఎంచుకుని… మళ్లీ వివాదాస్పదం చేస్తుందన్న అభిప్రాయంతో … ఇప్పటి వరకూ జరిగిన పరిణమాల్ని బట్టి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close