ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని… అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి పెట్టలేదు.. 23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారమేనని తేల్చి చెప్పేశారు. ఆనంకు ఎందుకు కోపం వచ్చిందంటే…తన నియోజకవర్గంలోపనులుజరగడం లేదని. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటుందని గుర్తించాలనిఆయనమండిపడ్డారు. మరో ఏడాది వేచి చూస్తానని..పనులు జరగకపోతే..ప్రభుత్వంపై ఉద్యమించడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని..ఆ లెక్కలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం చెప్పినా అధికారులు వినడం లేదని మండిపడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఆనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి ాదు. గతంలో మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించేశారంటూ నేరుగా ప్రభుత్వం పేరు ఎత్తకుండా మండిపడ్డారు. నెల్లూరులో పని చేయాలంటేనే అధికారులు భయపడుతున్నారని, అయిదేళ్ళలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరుకే దక్కిందంటూ ఘాటుగా విమర్శించారు. ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్ నుంచి యధేచ్ఛగా సాగుతున్న పోలీసులు సైతం అచేతనం అయిపోయారంటూ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలుచేసినప్పుడు.. జగన్ ఆగ్రహించారు.

షోకాజ్ నోటీసు జారీ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. తర్వాత పరిస్థితి సద్దు మణిగింది. ఆనం తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక.. నెల్లూరు రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉండటమే కారణమని భావిస్తున్నారు. మరో ఏడాది గడువు ఇస్తున్నానని చెప్పడం వనుక…తర్వాత మార్పు కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని.. సందేశం పంపిచారన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆనం వ్యాఖ్యలపై.. వైసీపీ హైకమాండ్ స్పందనేమిటో తెలియాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close