యాకూబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌పై రేపు ‘సుప్రీం’ తీర్పు

హైదరాబాద్: ముంబాయి పేలుళ్ళ కేసులో ఉరి శిక్ష విధించబడిన దోషి యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈనెల 30న అతనికి ఉరిశిక్ష అమలు జరగనున్న సంగతి తెలిసిందే. 250మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్న 1993నాటి ముంబాయి పేలుళ్ళ కేసులో పట్టుబడిన యాకూబ్ నేరం రుజువు కావటంతో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. యాకూబ్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ నెల 21న కొట్టిపారేసింది. అయితే అతనికి క్షమాభిక్ష పెట్టాలని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. వీరిలో బీజేపీ ఎంపీ శతృఘ్నుసిన్హా, కాంగ్రెస్ నాయుకుడు మణిశంకర్ అయ్యర్, సీపీఎం నాయకుడు సీతారామ్ ఏచూరి, సుప్రీమ్ కోర్టు న్యాయవాది రాంజెఠ్మలాని, నటుడు నజీరుద్దీన్ షా, దర్శకుడు మహేష్ భట్ ఉన్నారు. మరోవైపు నటుడు సల్మాన్ ఖాన్ యాకూబ్ ఉరిని వ్యతిరేకిస్తున్నట్లు ట్వీట్ చేయటంతో పెద్ద వివాదం చెలరేగటం, ఆ వ్యాఖ్యలను అతను ఉపసంహరించుకోవటం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close