ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని అదికారులు నివేదిక రూపొందించింది. దాని ఆధారంగా ‘కిషోర్‌ గ్రానైట్స్‌’కు జరిమానా విధిస్తూ గనుల శాఖ నోటీసులిచ్చింది. వీటిపై కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా… సింగిల్‌ బెంచ్‌ వాటిని కొట్టివేసింది. అయితే ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ కు వెళ్లింది. డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఆ తీర్పును కంపెనీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. కేసు పూర్వపరాలను పరిశీలించి.. ఇరు వైపు వాదనలు విన్న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కిషోర్ గ్రానైట్స్ పై ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం వారు న్యాయపోరాటం చేయడం కామన్‌గా మారింది. గత అక్టోబర్‌లో కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, కిషోర్‌ బ్లాక్‌ గోల్డ్‌ గ్రానైట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీల వేసిన ఫైన్ విషయంలోనూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే క్రమంలో ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఒక్కొక్కరికి వందల కోట్ల ఫైన్లు వేశారు. తనిఖీలు పేరుతో వ్యాపారాల్ని నిలిపివేశారు. పర్మిషన్లు ఆపేశారు. ఈ దెబ్బకు తట్టకోలేక ఐదేళ్లు మంత్రిగా చేసిన శిద్దా రాఘవరావు వంటి బడా గ్రానైట్ వ్యాపారి కూడా వైసీపీ కండువా కప్పేసుకుని రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. కానీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాత్రం పోరాడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని వేధింపులు ఎదురైనా తట్టుకునే ఉంటున్నారు. ఎన్ని కష్టనష్టాలైనా న్యాయపోరాటంచేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close