‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ సినిమా. ప్ర‌స్తుతం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఛ‌త్ర‌ప‌తి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేసి, ఈ త‌రానికి న‌చ్చేలా రూపొందిస్తున్నాడు వినాయ‌క్. హిందీ సినిమా కాబ‌ట్టి… వాళ్ల‌కి న‌చ్చే అంశాల‌న్నీ ఇందులో పొందు ప‌ర‌చి.. టోట‌ల్ గా ఓ గ్రాండ్ లుక్ ని తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలోనే స‌మ‌స్య మొద‌లైంది. ఈ చిత్రాన్ని `ఛ‌త్ర‌ప‌తి` అనే పేరుతోనే బాలీవుడ్ లోనూ విడుద‌ల చేద్దామ‌నుకున్నారు.కానీ..ఆ టైటిల్ ని మ‌రెవ‌రో ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేయించేసుకున్నారు. `శివాజీ` అనే పేరు అనుకుంటే అది కూడా రిజిస్ట‌ర్ అయి ఉంది. ఈ రెండు పేర్లూ త‌ప్ప‌.. ఈ క‌థ‌కు మ‌రో పేరు సూట‌వ్వ‌ద‌ని వినాయ‌క్ భావిస్తున్నాడు. ఛ‌త్ర‌ప‌తి టైటిల్ రిజిస్ట‌ర్ చేయించుకున్న నిర్మాత‌తో బేర‌సారాలు సాగుతున్నాయి. ఈ టైటిల్ ని వ‌దులుకోవ‌డానికి స‌ద‌రు నిర్మాత దాదాపు 2 కోట్లు అడుగుతున్న‌ట్టు టాక్‌.

తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో టైటిల్ రిజిస్ట్రేష‌న్ విష‌యంలో కొన్ని స‌దుపాయాలు ఉంటాయి. టైటిల్ రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటే ఆ టైటిల్ పై హ‌క్కు వ‌చ్చిన‌ట్టు కాదు. ఆ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించుకున్న ఆరు నెల‌ల‌లోపు సినిమా షూటింగ్ కూడామొద‌లెట్టాలి. మ‌రెవ‌రైనా షూటింగ్ మొద‌లెడితే, ఆ టైటిల్ వాళ్ల‌కు వెళ్లిపోతుంది. బాలీవుడ్ లో ఇలాంటి నిబంధ‌న ఏదీ లేదు. రిజిస్ట‌ర్ చేయించుకున్న యేడాది పాటు టైటిల్ దాచుకోవ‌చ్చు. ఆ త‌ర‌వాత రెన్యువ‌ల్ చేయించుకుంటే స‌రిపోతుంది. అందుకే బాలీవుడ్ లో టైటిల్ రిజిస్ట‌ర్ చేయించుకుని, ఆ త‌ర‌వాత చాలామంది మ‌రొక‌రికి అమ్ముకోవాల‌ని చూస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు బ‌ర్త్ డే గిఫ్టులు.. ఓ రేంజ్‌లో!

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. అందుకోసం చిరు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి బ‌ర్త్ డే గిఫ్టులు ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్నాయి. చిరు న‌టిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు...

‘బింబిసార 2’.. టార్గెట్ ఫిక్స్‌!

'బింబిసార' త‌ర‌వాత పార్ట్ 2 వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. కానీ ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. 'ముందు బింబిసార 1 హిట్ట‌వ్వాలి క‌దా..' అనుకొన్నారు. తీరా చూస్తే `బింబిసార` సూప‌ర్ హిట్ట‌య్యిపోయింది....

గోరంట్ల వీడియోపై కాదు టీడీపీ ఫోరెన్సిక్ రిపోర్టుపై సీఐడీ విచారణ !

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను సమర్థించేందుకు చివరికి ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ప్రభుత్వం ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్ చేయించేది లేదని తేల్చేయడంతో టీడీపీ నేతలు అమెరికాలోని ఎక్లిప్స్ అనే...

హ‌ను రాఘ‌వ‌పూడి.. నెక్ట్ ఏంటి?

'సీతారామం'తో... ఓ సూప‌ర్ స‌క్సెస్ కొట్టాడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈ విజువ‌ల్ బ్యూటీకి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇది వ‌ర‌కు కూడా హ‌నుకి హిట్లు ఉన్నాయి. కానీ... ఇంత గౌర‌వం ఎప్పుడూ రాలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close