పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా – విక్కీల పెళ్లికీ అంత‌టి మైలేజీ ఉంది. ఈనెల 9న వీరిద్ద‌రి పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచీ… వీళ్ల‌దే హ‌డావుడి అంతా. బాలీవుడ్ అంతా.. ఈ పెళ్లిపై ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టింది. రాజ‌స్థాన్ లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. కేవ‌లం 400మంది అతిథుల‌కు మాత్ర‌మే ఆహ్వానాలు అందాయి.

ఈ పెళ్లికి హాజ‌ర‌య్యేవారు సెల్ఫీలు తీయ‌డం, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం నిషిద్ధ‌మ‌ని.. ముందే చెప్పేశార్ట‌. దానికీ ఓ కార‌ణం ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని క‌త్రినా – విక్కీలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పెళ్లికి సంబంధించిన స‌మ‌స్త ఫుటేజీనీ. ఓ ఓటీటీ కంపెనీకి అమ్మేశారు. అక్ష‌రాలా వంద కోట్ల‌కు. బాలీవుడ్ లో సెల‌బ్రెటీ పెళ్లికి, అక్క‌డ తీసిన ఫొటోల‌కూ, వీడియోల‌కు మంచి డిమాండ్ ఉంది. కాక‌పోతే… ఎప్పుడూ వంద కోట్ల‌కు బేరం కాలేదు. అందులోనూ ఓటీటీ సంస్థ ఓ పెళ్లికి సంబంధించిన ఫుటేజీని వంద కోట్ల‌కు కొనుగోలు చేయ‌డం.. నిజంగా ఓ రికార్డే. డిసెంబ‌రు 9న ఈ పెళ్లిని స‌ద‌రు ఓటీటీ సంస్థ లైవ్ లో చూపించ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close