వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం మరో సంచలనం..!

యాభై శాతం వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాలంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. గతంలో.. ఈ అంశంపై.. ఐదు వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ.. ఇచ్చిన తీర్పును రివ్యూ చేయడానికి… సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు.. చంద్రబాబు నేతృత్వంలో ఇరవై ఒక్క పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వస్తున్నందున.. ఈ పిటిషన్‌ను త్వరితంగా విచారించాలని.. ఆయా పార్టీలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమస్థానం.. వచ్చేవారం విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని… గతంలోనే… విపక్ష పార్టీలన్నీ.. సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అయితే పేపర్ బ్యాలెట్ వాడాలని.. లేకపోతే వీవీ ప్యాట్ స్లిప్పులను యాభై శాతం లెక్కించాలని పిటిషన్‌లో కోరాయి.

అయితే.. ఈసీ మాత్రం… యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలంటే.. కనీసం వారం రోజులు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టు.. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లు లెక్కించాలని తీర్పునిస్తూ… పిటిషన్‌పై విచారణ ముగించింది. ఈ తీర్పు మేరకే… ఎన్నికల సంఘం.. మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈవీఎంలలో తీవ్రమైన గందరగోళం తలెత్తుతూండటంతో.. మొత్తానికే మోసం జరుగుతోందన్న ఆందోళనలో విపక్ష పార్టీలు ఉన్నాయి. అందుకే.. నమ్మకం కుదరలాంటే.. కచ్చితంగా… యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని రివ్యూ పిటిషన్ వేశారు. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడే.. లెక్కింపునకు.. ఒక్క రోజు కన్నా ఎక్కువ పట్టేది కాదని.. ఇప్పుడు వీవీ ప్యాట్లు లెక్కించడానికి ఎందుకు.. అంత సమయం పడుతుందని… విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

కోర్టుకు ఈసీ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. వచ్చే వారం జరగబోయే విచారణ కీలకం అయ్యే అవకాశం ఉంది. యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కింపులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపితే.. ఫలితాలు ఆలస్యమైనా… ఎన్నికలపై.. ఎవరికీ అనుమానం లేకుండా పోతుంది. విపక్షాలు సైతం.. వంకలు పెట్టడానికి చాన్స్ ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close