చట్టం మా చేతులను కట్టివేసింది: సుప్రీం కోర్టు

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాల నేరస్థుడి శిక్షను ఇక పొడిగించలేమని ఈరోజు సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొనడంతో కొన్ని విషయాలపై చర్చించవలసిన అవసరం ఏర్పడింది. బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేకిస్తూ సమాజం ఎంత తీవ్రంగా స్పందిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో అతనిని బయటకి విడిచిపెట్టడం వలన అతనికి ప్రాణహాని కలగకుండా ప్రభుత్వం నిరంతరం భద్రత కల్పించగలదా? అలాగే అతను మళ్ళీ అటువంటి హేయమయిన నేరానికి పాల్పడితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? మన ప్రభుత్వమా లేక చట్టాలకు కట్టుబడి అతనిని బయటకి విడిచిపెడుతున్న మన న్యాయ వ్యవస్థా?

ఈ కేసులో అత్యాచారానికి గురయి ఘోరంగా హత్య చేయబడిన నిర్భయ (ఆమె ఆలు పేరు జ్యోతీ సింగ్)కు న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తుంటే, అత్యంత హేయమయిన నేరానికి పాల్పడిన బాల నేరస్తుడు కేవలం మూడేళ్ళ నిర్బంధంతో బయటపడటమే కాకుండా ప్రభుత్వమే అతను జీవితంలో మళ్ళీ స్థిరపడేందుకు అతనికి రూ. 10, 000 నగదు, అవసరమయిన సహాయసహకారాలు అందిస్తోంది. ఈ కేసులో ఉరి శిక్ష పడిన మిగిలిన నలుగురు నేరస్తుల కేసుల విచారణ నేటికీ సుప్రీం కోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో బాలనేరస్తుడి విడుదలయ్యేడు.

చట్ట ప్రకారం చాలా మంచి ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అతనికి ఆర్ధిక సహాయం చేస్తున్నప్పటికీ, ఈ కేసులో బాధితురాలికి కోర్టులు ఇంతవరకు న్యాయం చేయలేనప్పుడు దోషికి న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవడమే అందరికీ విస్మయం కలిగిస్తోంది. అతని వలన సమాజానికి, సమాజం వలన అతనికి ఏ సమస్యా కలగకుండా ప్రభుత్వం అడ్డుకోలేదని అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అతనిని విడిచిపెట్టడం సరయిన నిర్ణయమేనా కాదా? అని ప్రభుత్వం, మన న్యాయ వ్యవస్థలు ఆలోచించుకోవలసి ఉంది.

అతని విడుదలకు అభ్యంతరం తెలుపుతూ దాఖలయిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు తన తీర్పు వెలువరిస్తూ “మేము కూడా ప్రజాభిప్రాయంతో ఏకీభవిస్తున్నాము. కానీ చట్టం మా చేతులని కట్టివేయడం వలన అతనిని ఇక నిర్బంధించలేము,” అని తెలిపింది.

నిజమే! మన న్యాయవ్యవస్థలు చట్టాన్ని అమలుచేయగలవు. అవసరమయితే దానికి బాష్యం చెప్పగలవు. కానీ వాటిలో లోపాలున్నట్లు గుర్తించినపటికీ వాటిని సవరించలేవు. ఆ అధికారం మన పార్లమెంటుకే ఉంది. కనుక ఈ బాలనేరస్తుడి కేసులో చట్ట సవరణలు చేయవలసి ఉంటుంది. మోడీ ప్రభుత్వం అందుకు అవసరమయిన చట్ట సవరణలు చేసి ఆ బిల్లును లోక్ సభ చేత ఆమోదింపజేసినప్పటికీ, రాజ్యసభలో బలం లేక పోవడం చేత అక్కడ ఆమోదింపజేసుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు సహకరిస్తే తప్ప ఈ చట్టసవరణలు ఆమోదానికి నోచుకోవు. కనుక ఈ బలనేరస్తుడి విషయంలో కోర్టులు ఏమీ చేయలేవని సర్దిచేప్పుకోక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close